జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా భారత్ బంద్… దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వర్తక, వాణిజ్యం.. కదలని వాహనాలు
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆలిండియా ట్రేడర్స్ భారత్ బంద్ నిర్వహించింది. బంద్‌కు దేశ వ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆలిండియా ట్రేడర్స్ భారత్ బంద్ నిర్వహించింది. బంద్‌కు దేశ వ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో పాటు అఖిలభారత వాహనదారుల సంక్షేమ సంఘం కూడా సంపూర్ణ మద్దతు పలికింది. పెరుగుతున్న పెట్రోలియం ధరలతోపాటు ఎలక్ట్రానిక్ వే బిల్లు నిబంధనలు, జీఎస్టీ తదితర అంశాలకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించారు.