AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇదే.. కేవలం 5 నిమిషాల్లో ఇలా చేసుకోండి

సాయంత్రం నాలుగు దాటిందంటే చాలు.. కడుపులో ఏదో తెలియని ఆకలి. టీ తాగుతూ ఏదైనా కరకరలాడేది తింటే బాగుండు అనిపిస్తుంది కదా? సాధారణంగా మనం ఇంట్లో బజ్జీలో, పకోడీలో వేసుకుంటాం. కానీ, ఎప్పుడైనా బెంగాలీ స్టైల్ 'ఝల్మురి' రుచి చూశారా? మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రధాని మోదీ స్వయంగా రోడ్డు పక్కన ఆగి మరీ ఈ స్నాక్‌ను ఎంతో ఇష్టంగా తిన్నారు. అప్పటి నుండి సోషల్ మీడియాలో ఈ ఝల్‌మురి హల్చల్ చేస్తోంది.

Phani CH
|

Updated on: May 07, 2026 | 4:37 PM

Share
ఝల్మురి అంటే కేవలం మరమరాలు మాత్రమే కాదు, అందులో వేసే రంగురంగుల కూరగాయలే దానికి నిండుతనాన్ని ఇస్తాయి. ఎర్రటి టమాటాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చని కొత్తిమీర.. ఇవన్నీ కలిస్తేనే ఆ రుచి. మామూలుగా అయితే మనం వీటిని విడివిడిగా తింటాం, కానీ ఝల్మురిలో ఇవన్నీ కలిసాక మన నోటికి కమ్మని రుచిని ఇస్తాయి. ముఖ్యంగా ఆ ఉడికించిన బంగాళదుంప ముక్కలు నోటికి తగులుతుంటే ఆ మజాయే వేరు. ఒకసారి ఈ పదార్థాలన్నీ సిద్ధం చేసుకుంటే, మీ వంటపని సగం పూర్తయినట్టే!

1 / 5
 చిక్కటి ఆవ నూనె ఝల్మురిలోని అసలైన రహస్యం. బెంగాలీ వంటకాల్లో ఆవ నూనె లేనిదే ముద్ద దిగదు. సాధారణంగా మనం వంటల్లో రిఫైన్డ్ ఆయిల్ వాడతాం, కానీ ఝల్మురిలో పచ్చి ఆవ నూనె వాడాలి. అది వేయగానే వచ్చే ఆ ఘాటు వాసన వంటగది అంతా నిండిపోతుంది. మొదట్లో కొంచెం వింతగా అనిపించినా, ఒక్కసారి రుచి అలవాటైతే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. ఇది జీర్ణక్రియకు కూడా మంచిదని పెద్దలు చెబుతుంటారు.

2 / 5
 ఝల్మురి తయారీలో వేగం చాలా ముఖ్యం.   పదార్థాలన్నీ వేసాక గరిటెతో లేదా చేత్తో గబగబా కలపాలి. ఎందుకంటే మరమరాలు ఎక్కువ సేపు ఉంటే మెత్తబడి చప్పగా అయిపోతాయి. స్ట్రీట్ వెండర్స్ దగ్గర గమనిస్తే, వారు ఒక డబ్బాలో వేసి భలే వేగంగా కలుపుతారు. ఆ శబ్దం వింటేనే మనకు ఆకలి మొదలైపోతుంది. ఇంట్లో కూడా మనం గిన్నెను అలా పైకి కిందకి ఆడిస్తూ కలిపితే ఆ మసాలాలన్నీ మరమరాలకు చక్కగా పడతాయి.

3 / 5
మనం ఇంట్లో ని ప్లాస్టిక్ లేదా గాజు గిన్నెల్లో తిన్న దానికంటే ,  పేపర్ కోన్‌లో  వేసుకుని తింటే వచ్చే తృప్తే వేరు. రోడ్డు పక్కన నిలబడి ఆ పేపర్ కోన్‌ను పట్టుకుని, చివరగా మిగిలిన ఆ చిన్న ముక్కల్ని కూడా వదలకుండా తినడం ఒక మధురమైన జ్ఞాపకం. ప్రధాని మోదీ కూడా ఇలాగే ఆ సాదాసీదా అనుభూతిని ఇష్టపడతారట. మీరు కూడా పిల్లలకు ఇలా పేపర్ కోన్‌లో సర్వ్ చేసి చూడండి, వారు ఏదో బయట కొన్నట్టుగా ఫీలవుతూ ఎంతో సంబరంగా తింటారు.

4 / 5
అన్ని కలిపాక చివరగా సిద్ధమైన ఝల్మురి ప్లేటు చూస్తుంటే ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో. పక్కన వేడి వేడి టీ కప్పు, ఇంట్లో వాళ్ళతో కాసేపు కబుర్లు.. ఇంతకంటే ఏం కావాలి? ఝల్‌మురిలో ఉండే ఆ పులుపు, కారం, ఘాటు మనల్ని రీఫ్రెష్ చేస్తాయి. ఆఫీసు నుండి వచ్చిన అలసట అంతా ఒక్క ప్లేటు ఝల్‌మురితో మాయమైపోతుంది. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, కుటుంబంతో గడిపే ఆ సంతోష క్షణాలకు ఒక చిన్న రుచికరమైన వంక!

5 / 5
Follow Us
మోదీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్.. కేవలం 5 నిమిషాల్లో ఇలా చేసుకోండి

డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే రూ. 3 వేలు గ్యారంటీగా ఆదా

NEET UG 2026 ఆన్సర్‌ కీ విడుదల.. ఈసారి భారీగా పెరగనున్న కటాఫ్‌

కొడుకు సమాధి వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో

Kuja Gochar: ఆ రాశుల వారికి ధన యోగం, అదృష్టం డబుల్..!

పళ్లురాని పసిపిల్లలు కూడా తినే పల్లెటూరి వంటకం నూకలపాయసం

చల్లని ఏసీ వెనుక దాగిన ఆరోగ్య సమస్యలు.. తెలుసుకోవాల్సిన నిజాలు

మీ కూలర్‌ నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు.. ఏసీ లాంటి కూలింగ్‌

రోడ్డుపైనే ముగిసిన తండ్రీకూతుళ్ల అనుబంధం..!

హిట్ మ్యాన్ రికార్డు బద్ధలు.. ధోనీ రికార్డుపై కన్నేసిన అభిషేక్