- Telugu News Photo Gallery Peripheral artery disease high cholesterol can cause legs pain follow this prevention tips
తరుచూ కాళ్ల నొప్పులు వస్తున్నాయా? ఇది ఈ తీవ్రమైన వ్యాధి లక్షణం కావొచ్చు.. బీకేర్‌ఫుల్..
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కాళ్లలో రక్త ప్రసరణ సరిగా జరగదు. ఇది చాలా కాలం పాటు నొప్పిని కలిగిస్తుంది. అయినప్పటికీ చాలా మందికి దాని గురించి తెలియదు.. అలాంటివారు నొప్పి సమస్యను శరీరంలో కాల్షియం లేదా రక్తం లేకపోవడం అని భావిస్తారు.. కానీ మీకు ఈ సమస్యలు ఏవీ లేకున్నా.. కొలెస్ట్రాల్ పెరిగితే ఇంకా నొప్పి ఉంటుంది.
Updated on: Jul 08, 2024 | 4:32 PM

తప్పుడు ఆహారపు అలవాట్లు, చెడిపోయిన జీవనశైలి కారణంగా చాలామంది ప్రజలు సమస్యల బారిన పడుతున్నారు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఎన్నో సమస్యలకు కారణమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరుగుదల గుండెకు హాని కలిగిస్తుంది.. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ మీ పాదాలకు కూడా హాని చేస్తుందని మీకు తెలుసా...? మీ కాళ్ళలో నొప్పి.. దీర్ఘకాలంపాటు కొనసాగితే, అది చెడు కొలెస్ట్రాల్ వల్ల కావచ్చు. ఈ సమస్యను పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు.

కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కాళ్లలో రక్త ప్రసరణ సరిగా జరగదు. ఇది చాలా కాలం పాటు నొప్పిని కలిగిస్తుంది. అయినప్పటికీ చాలా మందికి దాని గురించి తెలియదు.. అలాంటివారు నొప్పి సమస్యను శరీరంలో కాల్షియం లేదా రక్తం లేకపోవడం అని భావిస్తారు.. కానీ మీకు ఈ సమస్యలు ఏవీ లేకున్నా ఇంకా నొప్పి ఉంటుంది. కాళ్ళలో నొప్పి కొనసాగితే, మీరు మీ కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేయాలి. WHO ప్రకారం, భారతదేశంలో 25-30% మందికి అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంది.. కానీ వారిలో సగం కంటే ఎక్కువ మందికి దాని గురించి తెలియదు.

పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి అంటే ఏమిటి?: పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వల్ల కాళ్లు నొప్పులు వస్తాయని, కొందరిలో బిగుసుకుపోయే సమస్య కూడా ఉంటుందని ఢిల్లీలోని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. మీరు ఏదైనా శారీరక పని చేస్తుంటే, ఈ నొప్పి పెరుగుతుంది. పెరిగిన కొలెస్ట్రాల్ రక్త సిరల్లో పేరుకుపోవడం ప్రారంభించడం వల్ల ఇది జరుగుతుంది. దీనివల్ల కాళ్లకు రక్తప్రసరణ సరిగా జరగదు. రక్త ప్రసరణ తగ్గడం ప్రారంభించినప్పుడు, అది కాళ్ళపై కూడా ప్రభావం చూపుతుంది. క్రమంగా నొప్పి మొదలై తీవ్రమవుతుంది.ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత సమస్య పెరుగుతుంది.

వైద్యుడిని సంప్రదించండి: చాలా కాలంగా కాళ్లలో నొప్పి ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఊబకాయం సమస్య ఉన్నవారు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొలెస్ట్రాల్‌ను తనిఖీ చేయడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. పరీక్షలో కొలెస్ట్రాల్ పెరిగితే, ఆహారంలో మార్పులు, మందులు కూడా ఇవ్వవచ్చు.

కొలెస్ట్రాల్ పెరిగితే కనిపించే ఇతర లక్షణాలు: ఛాతిలో నొప్పి, శ్వాసకోస ఇబ్బంది, అలసట, వికారం, బలహీనత లాంటివి కనిపిస్తాయి.

కొలెస్ట్రాల్‌ను ఎలా నియంత్రించాలి: రోజువారీ వ్యాయామం, ఫాస్ట్ ఫుడ్ తినకుండా ఉండటం, మద్యపానం, ధూమపానం బంద్ చేయడం, ప్రతి 6 నెలలకొకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవడం ద్వారా.. నియంత్రించవచ్చు..




