- Telugu News Photo Gallery People swing in a hammock made of thorns to get Village Goddess blessings in Paderu, Alluri district
ఇదో వింత ఆచారం.. ముల్లులతో ఏర్పాటు చేసిన ఊయలలో ఊగితే ఇలా జరుగుతుందట..
అల్లూరి జిల్లా పాడేరు మండలం చింతలవెల్లి గ్రామంలో నమ్మకాలు, విశ్వాసాలు ఎక్కువ. భక్తి భావంతో అంతా సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పూజల సందర్భంగా అందరూ ఒక చోట చేరుతారు. గ్రామంలో ఉన్న శివాలయం వద్ద ముల్లులతో ఊయల ఏర్పాటు చేస్తారు. ఆ ఊయలలో గిరిజనులు ఒక్కొక్కరు ఊగుతూ ఉంటారు. ముల్లు గుచ్చుకొని గాయాలు పాలు కాకుండా తమకు అమ్మవారే రక్షిస్తారని అక్కడ గిరిజనుల నమ్మకం.
Maqdood Husain Khaja | Edited By: Srikar T
Updated on: Nov 29, 2023 | 12:08 PM

కొండా కోనల్లో నివసించే ఆదివాసీలకు.. సంస్కృతి సాంప్రదాయాలు కాస్త భిన్నంగా ఉంటాయి. సందర్భానికి అనుసారంగా తమ భక్తుని చాటుకుంటూ ఉంటారు అడవి బిడ్డలు. అది ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది.

అల్లూరి జిల్లా పాడేరు మండలం చింతలవెల్లి గ్రామంలో నమ్మకాలు, విశ్వాసాలు ఎక్కువ. భక్తి భావంతో అంతా సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

చింతల వీధిలోని జయమ్మ అనే గిరిజనురాలు ఇంట్లో సాంప్రదాయబద్ధంగా పూజలు చేస్తారు. అమ్మవారు పూనిన వారికి శాంతి పూజలు నిర్వహిస్తారు. ముల్లులతో కూడిన ఊయలలో ఊగిన వారికి అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎటువంటి గాయాలు కాకుంటే.. గ్రామానికి కీడు సోకదని, గ్రామస్తులకు అనారోగ్య సమస్యలు రావని విశ్వాసం.

పూజల సందర్భంగా అందరూ ఒక చోట చేరుతారు. గ్రామంలో ఉన్న శివాలయం వద్ద ముల్లులతో ఊయల ఏర్పాటు చేస్తారు. ఆ ఊయలలో గిరిజనులు ఒక్కొక్కరు ఊగుతూ ఉంటారు. ముల్లు గుచ్చుకొని గాయాలు పాలు కాకుండా తమకు అమ్మవారే రక్షిస్తారని అక్కడ గిరిజనుల నమ్మకం.

ఆ తర్వాత త్రిమూర్తుల పూజ నిర్వహిస్తారని అంటున్నారు గ్రామ పూజారి గాసన్న. గ్రామ చావడిలో పందిరి వేసి పూజ నిర్వహించి తర్వాత ముల్లులతో ఏర్పాటు చేసిన ఉయ్యాలను ఊగుతారు. తర్వాత అగ్నిగుండం ఏర్పాటు చేసి అందులో నడుస్తారు.





























