- Telugu News Photo Gallery Obesity epidemic: 260 million in US will be overweight by 2050, says study
Obesity: మరో పాతికేళ్లకు తలకిందులు కానున్న యువత ఆరోగ్యం.. ఏ మందులు కంట్రోల్ చేయలేవట!
నేటి జీవనశైలి మన ఆరోగ్య ప్రమాణాలను పూర్తిగా దెబ్బ తీస్తుంది. ఇదిలాగే కొనసాగితే 2050 నాటికి పరిస్థితి చేయిదాటే స్థాయికి చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో నివసించే 260 మిలియన్ల జనాలు ఊబకాయం బారీనపడే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి..
Updated on: Nov 17, 2024 | 9:26 PM

ప్రస్తుత జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే యువత ఉబకాయం బారీన పడుతున్నారు. ఇదిలాగే కొనసాగితే వచ్చే పావు శతాబ్దంలో అమెరికాలో అధిక బరువు, ఊబకాయం ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, ఈ సమస్యను ఆపడానికి చికిత్సలు సరిపోవని పరిశోధకులు హెచ్చిరిస్తున్నారు.

ది లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో గురువారం ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. 2050 నాటికి దాదాపు 260 మిలియన్ల అమెరికన్లు అధిక బరువు, ఊబకాయంతో ఉంటారని అంచనా వేసింది.

ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి వైద్య ఖర్చులు పెరుగుతాయట. వయోజన పురుషులలో ఈ నిష్పత్తి 2021లో 10%కి పెరిగింది. ఇది క్రమంగా 76 నుండి 81 వరకు పెరుగుతుందని తెల్పింది. మహిళల్లో ఇది 10% ఉండగా.. అది 73 నుంచి 82కి పెరగడం ఖాయం అంటున్నారు.

స్థూలకాయాన్ని ఒక వ్యాధిగా గుర్తించడంలో వైద్య వ్యవస్థ అంతగా అప్రమత్తంగా లేనప్పటికీ.. ఇది మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్‌తో సహా అనేక ప్రమాదకరమైన, విస్తృతమైన అనారోగ్య ప్రమాదాన్ని పెంచుతుంది.

స్టడీ సహ రచయిత మేరీ Ng మాట్లాడుతూ బరువు తగ్గించే ఔషధాల ద్వారా అధిక బరువు ప్రమాదాన్ని జయించడం సరికాదు. మందులతో దాటవేయం లేదా బరువు తగ్గడం మరింత ప్రమాదానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.




