- Telugu News Photo Gallery Nutrition Facts And Health Benefits Of Eating Broccoli In Telugu Lifestyle News
Broccoli Benefits : బ్రకోలీ తింటే ఈ సమస్యలన్నీ దూరం.. లాభాలు తెలిస్తే..
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇందుకోసం పోషక విలువలను ఆహారంలో చేర్చుకోవాలి. అలాంటి ఆహారాల్లో బ్రోకలీ కూడా ఒకటి. బ్రోకలీ ఆరోగ్యానికి దివ్యౌషధం. దీనిని తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు మొదలవుతాయి. బ్రకోలీ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Jan 23, 2025 | 11:12 AM

బ్రోకలీలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ల నొప్పులకు కారణమయ్యే ఎంజైమ్‌లను అడ్డుకుంటాయి. బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

బ్రకోలీలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో తగిన మోతాదులో ఫైబర్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. పైగా, కళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బ్రకోలీలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కంటి సంబంధిత సమస్యలను అధిగమించడానికి బ్రకోలీని తీసుకోవడం మంచిది.

బ్రొకోలీ జీర్ణఎముకలను పటిష్టం చేయడంలో సహకరిస్తుంది. బ్రకోలీలో క్యాల్షియం, విటమిన్ కె తగినంత మొత్తంలో ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. అంతే కాకుండా కండరాలు కూడా దృఢంగా మారతాయి. బ్రకోలీ తింటే హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ సమస్య తీరుతుంది. క్రియ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. బ్రోకలీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ల నొప్పులకు కారణమయ్యే ఎంజైమ్‌లను అడ్డుకుంటుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్రకోలీలో పొటాషియం, విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీన్ని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఇమ్యూనిటీని పెంచడంలో కూడా బ్రకోలీ చాలా మంచిది. రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది. అయితే, థైరాయిడ్ ఉన్నవారు తినకపోవడమే మంచిది.

బ్రకోలీని ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల చర్మానికి చాలా మంచిది. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. దీనికి కారణం బ్రకోలీ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుంది. బ్రకోలీలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. వేడి వాతావరణంలో డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు ఇది చాలా మంచిది.





























