- Telugu News Photo Gallery Cricket photos Pace bowler Arshdeep Singh becomes the highest wicket taker for India in Just 1264 balls
కేవలం 1264 బంతుల్లోనే చరిత్ర సృష్టించిన అర్షదీప్.. భారత బౌలర్లలోనే టాప్ ప్లేస్
Arshdeep Singh Record: భువనేశ్వర్ కుమార్ 10 సంవత్సరాల పాటు నెలకొల్పిన, యుజ్వేంద్ర చాహల్ 7 సంవత్సరాలలో రాసిన రికార్డును కేవలం 2 సంవత్సరాలలో టీమిండియా యువ లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బద్దలు కొట్టాడు. అది కూడా 1264 బంతులు మాత్రమే బౌలింగ్ చేయడం గమనార్హం.
Updated on: Jan 23, 2025 | 10:15 AM

టీ20 క్రికెట్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్షదీప్ సింగ్ రికార్డు సృష్టించాడు. అది కూడా కేవలం 1264 బంతుల్లోనే కావడం ఆశ్చర్యకరం. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అర్షదీప్ కేవలం 2 సంవత్సరాల్లోనే భారత నంబర్‌వన్ బౌలర్‌గా మారాడు.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ అత్యుత్తమ ధాటికి 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు వికెట్లతో అర్ష్‌దీప్ సింగ్ భారత్ తరపున సరికొత్త రికార్డును లిఖించాడు.

టీమిండియా తరపున 61 టీ20 మ్యాచ్‌లు ఆడిన అర్షదీప్ సింగ్ ఇప్పటి వరకు 210.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంటే 1264 బంతుల్లో 97 వికెట్లు తీశాడు. దీంతో అతి తక్కువ బంతుల్లో 95కి పైగా వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

ఇంతకు ముందు టీ20 క్రికెట్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉంది. చాహల్ 1764 బంతుల్లో 96 వికెట్లు తీశాడు. అంటే 294 ఓవర్లలో 96 వికెట్లు తీశాడు.

ఇప్పుడు ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా మూడో స్థానంలో నిలిచాడు. కానీ పాండ్యా సరిగ్గా 1763 బంతులు వేసి 91 వికెట్లు తీశాడు. అంటే అర్షదీప్ కంటే అతను ఇప్పటికే 500 ఎక్కువ బంతులు వేశాడు.

అదేవిధంగా టీమ్ ఇండియా స్వింగ్ మాస్టర్ గా మారిన భువనేశ్వర్ కుమార్ 1791 బంతుల్లో 90 వికెట్లు తీశాడు. వీరందరినీ అధిగమించి కేవలం 2 ఏళ్ల వ్యవధిలో 1264 బంతుల్లో అర్ష్‌దీప్ సింగ్ అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం.




