సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారి జీవితాల్లో కొత్త వెలుగులు!
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అన్ని గ్రహాల్లోకెళ్ల సూర్యగ్రహం చాలా శక్తివంతమైనది. అంతే కాకుండా ఈ గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే జూన్ 15న సూర్యుడి సంచారం జరగబోతుంది. వృషభ రాశిలో ఉణ్న సూర్యగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది. దీని వలన ఐదు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందంట, అంతే కాకుండా వారి జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
Updated on: Jun 08, 2025 | 9:05 PM

కుంభ రాశి : అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహం సంచారం వలన కుంభ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. ధనయోగం ఉంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అంతే కాకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.

మిథున రాశి : సూర్య గ్రహం మిథున రాశిలోకి సంచారం చేయడం వలన మిథున రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. వీరికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఏ పని చేపట్టినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది. మొడి బాకీలు వసూలు అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది.

సింహ రాశి : మిథున రాశిలోకి సూర్యుడి సంచారం వలన సింహ రాశి వారికి డబ్బుకు లోటు ఉండదు. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అప్పులు తీరిపోతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా రానీ బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది.

తుల రాశి : తుల రాశి వారికి ధనయోగం కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. వీరు ఏ పని చేసినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది.

మేష రాశి : సూర్యుడి సంచారంతో మేష రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు అనేక మార్గాల ద్వారా మనీ సంపాదిస్తారు. విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి తిరుగే లేదని చెప్పవచ్చు.



















