Neem Leaves: చేదుగా ఉన్నాయని తీసిపారేయకండి.. వేప ఆకులతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాకవ్వాల్సిందే..
Neem Leaves Benefits: మన ఇంటి పరిసరాల్లో ఎక్కడ చూసినా వేప చెట్లు కనిపస్తుంటాయి. వీటిని ప్రాచీన కాలం నుంచి పలు చికిత్సలల్లో ఉపయోగిస్తున్నారు. వేపాకులు చేదుగా ఉన్నా అమృతం కంటే తక్కువ ఏం కాదని నిపుణులు సూచిస్తున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగే వేపాకుల్లో ఎన్నో ఔషధాలు దాగున్నాయి. వాటితో కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 23, 2022 | 5:19 PM

పరగడుపున వేప ఆకులను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చేదు రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. అనేక రకాల శారీరక రుగ్మతలను తగ్గించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

వేప ఆకులు ముఖంపైనున్న మొటిమలను తొలగిస్తాయి. గాయాలను కూడా త్వరగా నయం చేస్తుంది. మొటిమలు, గాయాల నొప్పులకు వేప ఆకు పేస్ట్ ద్వారా ఉపశమనం పొందవచ్చు

వికారం, దురద లేదా దద్దుర్లు, చర్మ సమస్యలు ఉన్నవారు రోజూ చేదు వేప ఆకులను తింటే మంచిది.

వేప ఆకులను ఉడకబెట్టి ఆ నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల కడుపులోని పురుగులు నశిస్తాయి. బిట్టర్ ఫ్లూ జ్వరం, ఇతర వ్యాధులను కూడా నయం చేస్తుంది.

వేప పుల్లలతో దంతాలను శుభ్రపరచడం వల్ల నోటి దుర్వాసన, పలు సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.

వేప ఆకుల రసం తాగినా.. నీళ్లతో నానబెట్టి తాగినా కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి.

మధుమేహంతో బాధపడేవారికి వేప ఆకులు ఔషధంలా పనిచేస్తాయి. వేప ఆకులను రోజూ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.





























