అలాగే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వీటిని తరచూ తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది
TV9 Telugu
అలాగే జలుబు, ఫ్లూ లాంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. గుండెకు మేలు చేస్తాయి. కొవ్వును తగ్గించడంలో సాయపడతాయి
TV9 Telugu
వీటిలోని విటమిన్-ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రాబెర్రీలను సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. వీటిలోని పీచు జీర్ణక్రియ చక్కగా సాగేలా చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉండదు. పిల్లలు, పెద్దలు, గర్భిణులు అందరూ తినొచ్చు. నేరుగా తింటే ప్రయోజనాలన్నీ అందుతాయి
TV9 Telugu
ఎర్రగా నిగనిగలాడే ఈ పండ్లు తింటే చర్మం కాంతిమంతంగా మారుతుంది. ఈ పండులోని ఫ్లేవనాయిడ్స్ మెదడులో వాపులను తగ్గిస్తాయి
TV9 Telugu
అలాగే వయసు రీత్యా వచ్చే మతిమరపును తొందరగా రానీయవు. దీంట్లోని ఫోలేట్, విటమిన్-సి, ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. ఇన్ని ప్రయోజనాలున్న దీన్ని తింటే సరి