పాములను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్.. ఇవి మీ ఇంట్లో ఉంటే.. సర్పాలు రమ్మన్నా రావు
వర్షాకాలం వచ్చిందంటే చాలా పుట్టల్లో ఉండాల్సిన పాములన్నీ.. జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి. ఇళ్లలోకి దూరి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు ఇవి ప్రాణాలకే ముప్పు తీసుకురావచ్చు. కాబట్టి పాములను ఇబ్బందికి గురిచేసే కొన్ని వస్తువులను మన ఇంటి పరిసరాల్లో ఉంచడం ద్వారా వాటిని మన ఇళ్లలోకి రాకుండా నివారించవచ్చు. అలాంటి ఒక వస్తువు గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
Updated on: Oct 07, 2025 | 9:13 PM

వర్షాకాలం వచ్చిందంటే చాలా పుట్టల్లో ఉండాల్సిన పాములన్నీ.. జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి. ఇళ్లలోకి దూరి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు ఇవి ప్రాణాలకే ముప్పు తీసుకురావచ్చు. కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.

వర్షాకాలంలో పాములు మన ఇళ్లలోకి రాకుండా ఉండాలంటే.. మన ఇంటి పరిసరాల్లో లేదా ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంచాలి. ఎందుకంటే కొబ్బరి చిప్పలు పాములకు అసహ్యకరమైన వాసనను కలిగి ఉంటాయి. మానవులకు ఎక్కువగా తెలియని ఈ వాసన పాములకు చాలా ఇబ్బందిగా ఉంటుందట. ఈ వాసనను గమనించే పాము అవి ఉన్న దిశలో రాకుండా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

కాబట్టి మీరు ముందుగా ఎండిన కొబ్బరికాయను తీసుకొని దాని పైభాగాన్ని తొలగించి. ఆ తర్వాత, కొబ్బరికాయను 3-4 భాగాలుగా కట్‌చేయండి. ఆ ముక్కలను తలుపు మూలల్లో.. వరండా మూలల్లో ఉంచండి.

అయితే ఇలా తలుపు పక్కన ఉంచిన కొబ్బరి ముక్కలను ప్రతి వారం లేదా పది రోజులకు ఒకసారి మార్చండి. ఇలా చేయడం ద్వారా పాములు మీ ఇంటిలోపలికి, పరిసరాల్లోకి రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గ్రామాల్లో ఈ పద్దతిని చాలా కాలంగా పాటిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. రసాయనాలు లేకుండా ఇంటిని సహజంగా రక్షించుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం అంటున్నారు. ఇంట్లో చెట్లు, మొక్కలు, తోటలు ఎక్కువగా ఉన్న సందర్భాలలో ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ( NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమేఅందించబడినవి.. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)




