- Telugu News Photo Gallery Spiritual photos Sun in Libra Debilitation: Rajayogas and Wealth for 6 Zodiac Signs details in Telugu
Telugu Astrology: రవి నీచబడ్డా.. ఆ రాశుల వారికి ధన, రాజయోగాలే!
Raja Yoga and Dhana Yoga: ఈ నెల(అక్టోబర్) 17 నుంచి నెల రోజుల పాటు గ్రహ రాజు రవి తులా రాశిలో నీచబడడం జరుగుతోంది. అయితే, అధికారానికి, ఉద్యోగానికి, రాజకీయాలకు, తండ్రికి కారకుడైన రవి నీచబడినా కొన్ని రాశులకు రాజయోగాలను, ధన యోగాలను ఇచ్చే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కా టకం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి పదోన్నతులు, రాజకీయ ప్రాబల్యం, సంపద వృద్ధి, తండ్రి నుంచి అనుకూలతలు, ఆస్తి సమస్యలు, కోర్టు వివాదాల పరిష్కారం వంటివి తప్పకుండా జరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
Updated on: Oct 07, 2025 | 7:32 PM

మేషం: ఈ రాశికి సప్తమ స్థానంలో రవి నీచబడడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తప్ప ఇతరత్రా వీరికి ఎక్కువగా రాజయోగాలు, ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. జీవితంలో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తుంది. తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది.

మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో రవి సంచారం వల్ల ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగాలు లభిస్తాయి. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి నీచబడడం వల్ల సొంత ఇంటి కల నెరవేరుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే సూచనలున్నాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లబిస్తుంది. ప్రభుత్వం నుంచి ఊహించని గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కార మవుతాయి. భూలాభం కలుగుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తుల: ఈ రాశిలో రవి నీచబడుతున్నందువల్ల ఆదాయపరంగా ఊహించని అభివృద్ధి ఉంటుంది. రావలసిన సొమ్ముతో పాటు మొండి బాకీలు కూడా వసూలవుతాయి. తండ్రి వైపు నుంచి సంపద లభిస్తుంది. రాజకీయ ప్రాబల్యంకలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో రవి నీచబడడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలతో పాటు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కూడా ఊహించని సత్ఫలితాలనిస్తాయి. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపా రాల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి విశేషంగా పెరిగే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల దిగ్బల యోగం కలిగింది. దీనివల్ల రాజయోగాలు, ధన యోగాలు ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ది చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిత్రార్జితం లభిస్తుంది.



