- Telugu News Photo Gallery Spiritual photos Deepavali Auspicious Signs: Boost Wealth and goddess Lakshmi devi s Blessings
Diwali 2025: దీపావళి రోజున ఇవి కనిపించాయంటే.. మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే.. డబ్బు ఇబ్బందులన్నీ పరార్..
దేశ వ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. ఈ సంవత్సరం దీపావళి పండగను అక్టోబర్ 20వ తేదీ సోమవారం జరుపుకోనున్నారు. దీపావళి రోజున లక్ష్మీదేవికి పూజలు చేయడమే కాదు.. ఈ పండగ శుభ సందర్భంగా కొన్ని వస్తువులను చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీపావళి నాడు వేటిని చూడడం శుభ సంకేతాలుగా పరిగణిస్తారో తెలుసుకుందాం.
Updated on: Oct 07, 2025 | 10:40 AM

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య తితిని దీపావళి పండగగా జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి. ఈ సంవత్సరం దీపావళి పండగ అక్టోబర్ 20వ తేదీ సోమవారం వచ్చింది. ఈ రోజున గణేశుడిని, లక్ష్మీదేవిని కలిపి పూజించడం వల్ల గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని నమ్మకం. అంతేకాదు సురక్షితమైన జీవితం లభిస్తుంది. ఈ రోజున ప్రజలు తమ ఇళ్ళు, దుకాణాలు, కార్యాలయాలలో దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని స్వాగతిస్తారు. దీపావళి శుభ సందర్భంగా కొన్ని వస్తువులను చూడటం చాలా శుభప్రదంగా జ్యోతిష్కులు భావిస్తారు. దీపావళి రోజున ఏ వస్తువులను చూడటం శుభప్రదంగా భావిస్తారో తెలుసుకుందాం..

గుడ్లగూబ: పురాణ గ్రంథాలలో గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా వర్ణించారు. దీపావళి శుభ దినాన ఎవరైనా గుడ్లగూబను చూసినట్లయితే.. వారిపై త్వరలో లక్ష్మీదేవీ ఆశీస్సులు లభించనున్నాయని నమ్మకం. అంతేకాదు ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం త్వరలో ముగుస్తుందని విశ్వాసం. కనుక ఈ శుభ సంకేతాన్ని విస్మరించవద్దు.

కమలం పువ్వు: సంపదల అధిదేవత లక్ష్మీదేవి కమలం పువ్వుపై కూర్చుని చేతిలో కమలం పువ్వు పట్టుకుంది. దీపావళి సమయంలో మీరు కమలం పువ్వును చూసినట్లయితే.. మీ సంపద పెరుగుతుందని అర్థమట. దీపావళి రోజున కమలం పువ్వును చూడటం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందని సూచిస్తుంది. అంతేకాదు దీపావళి రోజున లక్ష్మీ దేవికి పూజ సమయంలో కమలం పువ్వును సమర్పించడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది

కాకి: దీపావళి శుభ సందర్భంగా మీరు కాకిని చూసినా.. ఇంటి ఆవరణలోకి కాకి వచ్చినా.. అది మీ పూర్వీకుల నుంచి మీకు ఆశీర్వాదం లభిస్తున్నట్లు సంకేతం కావచ్చు. శాస్త్రాలలో కాకిని పూర్వీకుల చిహ్నంగా పేర్కొన్నారు. కనుక దీపావళి వంటి పండగ రోజున కాకి మీ ప్రాంగణంలో లేదా టెర్రస్‌పై వాలితే.. మీరు మీ పూర్వీకుల నుంచి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం.

ఆవులు, బల్లులు, హిజ్రాలు దీపావళి శుభ సందర్భంగా ఆవులు, బల్లులు , హిజ్రాలను చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీపాల పండుగ శుభ సందర్భంగా వీటిని చూడటం మీకు మంచి సమయం ప్రారంభమవుతుందని చెప్పకనే చెబుతుందట. మీ జీవితంలో సానుకూల శక్తి పెరుగుదలను కూడా సూచిస్తుంది.




