చమోమిలే టీ : చమోమిలే టీ శతాబ్దాలుగా నిద్ర సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తున్నారు. ఎన్‌సిబిఐలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఎపిజెనిన్ అనే అంశాలు ఉన్నాయి. ఇవి మెదడును ప్రశాంతంగా ఉంచడంలో, నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి. నిద్రపోయే ముందు ఒక కప్పు చమోమిలే టీ తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది.