స్వామివారికి దాదాపు మూడు గంటల పాటు వివాహమహోత్సవం జరుగుతుంది. దీనిని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. కల్యాణంతో పాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడటం మరోవిశేషం. శివరాత్రి మహోత్సవం సమయంలో మురమళ్ల వీరేశ్వరస్వామి దేవాలయం భూ కైలాసంగా భక్తులతో కీర్తించబడుతుంది. రోజుకిన్ని కళ్యాణాలు అన్న లెక్క ఉండటంతో భక్తులు సుమారు నెల రోజులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకొంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం నిత్యాన్నదానం, వసతి సౌకర్యం ఉంది. కాకినాడకు 36 కిలోమీటర్లు, రాజమండ్రికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.