- Telugu News Photo Gallery Cricket photos Mumbai indians fastest ipl centuries ryan rickelton breaks record
8 ఫోర్లు, 7 సిక్స్‌లు.. 44 బంతుల్లో కాటేరమ్మ కొడుకుల దూల తీర్చేశాడుగా.. ముంబై హిస్టరీలోనే తోపు రికార్డ్
Mumbai Indians fastest century: ముంబై ఇండియన్స్ తరపున నమోదైన ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డును రియాన్ రికెల్టన్ బద్దలు కొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపుడుతోన్న ముంబై జట్టుకు ఓపెనర్ రియాన్ రికెల్టన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ముంబై జట్టు భారీ స్కోర్ సాధించింది.
Updated on: Apr 29, 2026 | 9:24 PM

ముంబై ఇండియన్స్ హిట్టర్ల విధ్వంసానికి వాంఖడే స్టేడియం మరోసారి వేదికైంది. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రియాన్ రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే శతకం బాది, ముంబై జట్టు తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పాత రికార్డులన్నీ ఈ ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

ముంబై ఇండియన్స్ అంటేనే భారీ హిట్టర్లకు నిలయం. అయితే, గత 18 ఏళ్లుగా శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉన్న రికార్డును తాజాగా రియాన్ రికెల్టన్ తిరగరాశాడు. 2008లో జయసూర్య 45 బంతుల్లో సాధించిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును, రికెల్టన్ 44 బంతుల్లోనే అధిగమించాడు. హైదరాబాద్ బౌలర్లను ఉతికేస్తూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించిన రికెల్టన్, ముంబై అభిమానులను ఉర్రూతలూగించాడు.

కేవలం రికెల్టన్ మాత్రమే కాదు, ఇదే సీజన్లో తెలుగు తేజం తిలక్ వర్మ కూడా తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో తిలక్ 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా జయసూర్య రికార్డును సమం చేయడమే కాకుండా, ముంబై జట్టులో అత్యంత నమ్మకమైన ఆటగాడిగా మరోసారి నిరూపించుకున్నాడు. యువ రక్తం ఉరకలేస్తున్న ముంబై జట్టులో తిలక్ ప్రదర్శన జట్టు భవిష్యత్తుపై ధీమాను పెంచుతోంది.

ముంబై జట్టు తరపున తక్కువ బంతుల్లో సెంచరీలు సాధించిన టాప్ 5 వీరుల జాబితాను ఓసారి చూద్దాం.. 1. రియాన్ రికెల్టన్: 44 బంతులు (సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై, 2026), 2. సనత్ జయసూర్య: 45 బంతులు (చెన్నై సూపర్ కింగ్స్‌పై, 2008), 3. తిలక్ వర్మ: 45 బంతులు (గుజరాత్ టైటాన్స్‌పై, 2026), 4. కామెరాన్ గ్రీన్: 47 బంతులు (సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై, 2023), 5. సూర్యకుమార్ యాదవ్: 49 బంతులు (గుజరాత్ టైటాన్స్‌పై, 2023).

గతంలో కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు 50 లోపు బంతుల్లో సెంచరీలు చేసినప్పటికీ, 2026 సీజన్ ముంబై ఇండియన్స్‌కు రికార్డుల పంట పండించింది. రికెల్టన్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్ల అటాకింగ్ గేమ్ ముంబై ఇండియన్స్‌ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లు ఐపీఎల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
