Menstrual Health: ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గాలంటే.. అమ్మమ్మల కాలంనాటి ఈ చిట్కా బలేగా పనిచేస్తుంది
పీరియడ్స్ సమయంలో అధిక రక్తపోటు, పొత్తికడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, విరేచనాలు, తలనొప్పి, శారీరక బలహీనత వంటి సమస్యలు వెంటాడుతాయి. PCOD లేదా PCOS ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది..
Updated on: Sep 11, 2024 | 1:33 PM

పీరియడ్స్ సమయంలో అధిక రక్తపోటు, పొత్తికడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, విరేచనాలు, తలనొప్పి, శారీరక బలహీనత వంటి సమస్యలు వెంటాడుతాయి. PCOD లేదా PCOS ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.

పీరియడ్స్ సమయంలో శారీరక అసౌకర్యం, నొప్పిని తగ్గించుకోవడానికి చాలా మంది మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా మందులు తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయం కూడా ఉంటుంది. సమస్య తీవ్రంగా ఉంటే మందుల సహాయం తీసుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు.

అయితే ఆయుర్వేదం సహాయంతో రుతుక్రమ సమస్యలను సహజంగా దూరం చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. పీరియడ్స్ సమయంలో గర్భాశయ సంకోచాలు పొత్తి కడుపులో నొప్పిని కలిగిస్తాయి. ఈ సమయంలో అల్లం టీ తాగడం వల్ల గర్భాశయ కండరాలు రిలాక్స్ అవుతాయి.

అధిక రక్తస్రావం ఉంటే దాల్చిన చెక్క టీ త్రాగాలి. గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే సమస్య తగ్గుతుంది. అలాగే పసుపు పొడి పాలలో కలిపి తాగినా ఉపశమనం కలుగుతుంది. శారీరక మంట, అసౌకర్యం తగ్గిస్తుంది. ఇది కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ డ్రింక్ తాగడం వల్ల నిద్ర మెరుగవడంతో పాటు శరీరం రిలాక్స్ అవుతుంది.

పీరియడ్స్‌కు సంబంధించిన శారీరక సమస్యలు తగ్గాలంటే అవిసె గింజలు నానబెట్టిన నీటిని తాగాలి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.




