రాత్రి త్వరగా పడుకుని, ఉదయం 5 గంటలకు నిద్రలేవడం వల్ల మీ జీవితం చక్కబడుతుంది. చదువుకునేవారు ఈ కింది రోజువారీ అలవాట్లను అలవాటు చేసుకుంటే మరింత క్రమబద్ధంగా, ఏకాగ్రతతో అధ్యయనం చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఉదయం పూట శబ్దం తక్కువగా ఉంటుంది. పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి మనస్సు చెదిరిపోదు. మానసికంగా బలంగా ఉంచేందుకు సులభతరం చేస్తుంది. చదవడానికి కూర్చుంటే ఏకాగ్రత వస్తుంది. ఉదయం, మనస్సు స్పష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కష్టమైన, సంక్లిష్టమైన సమస్యలపై సాధన చేస్తే, పరిష్కారం దొరుకుతుంది.