- Telugu News Photo Gallery Cinema photos Kriti shetty comment on tollywood goes viral in social media
Kriti shetty: టాలీవుడ్ పై కృతి శెట్టి సంచలన కామెంట్స్.. నెట్టింట వైరల్
తెలుగులో ఎంతో ఎత్తుకు ఎదుగుతారనుకుంటే, ఉన్నపళంగా డీలా పడిపోయారు కృతి శెట్టి. వరుసగా అవకాశాలు వచ్చినా, అవి హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో కృతి శెట్టికి పెద్ద మైనస్ అయింది. అందుకే తెలుగును దాటి తమిళ్, మలయాళంలో అవకాశాలను వెతుక్కుతున్నారు. లేటెస్ట్ గా ఆమె నటించిన మలయాళ మూవీ ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కి వచ్చేశారు.. ఈ సందర్భంగా చాలా విశేషాలే జరిగాయి..
Updated on: Sep 11, 2024 | 1:13 PM

తెలుగులో ఎంతో ఎత్తుకు ఎదుగుతారనుకుంటే, ఉన్నపళంగా డీలా పడిపోయారు కృతి శెట్టి. వరుసగా అవకాశాలు వచ్చినా, అవి హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో కృతి శెట్టికి పెద్ద మైనస్ అయింది. అందుకే తెలుగును దాటి తమిళ్, మలయాళంలో అవకాశాలను వెతుక్కుతున్నారు.

లేటెస్ట్ గా ఆమె నటించిన మలయాళ మూవీ ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కి వచ్చేశారు.. ఈ సందర్భంగా చాలా విశేషాలే జరిగాయి.. అవేమిటో మనమూ మాట్లాడుకుందాం... వచ్చేయండి...

కృతి శెట్టికి నా కుటుంబ సభ్యులు అభిమానులు. ఆమె నటించిన బుల్లెట్ సాంగ్ మా పిల్లలు పదే పదే వింటుంటారు. కృతి శెట్టి ప్రతిభావంతురాలు. చిన్న వయసైనా పరిణతితో ఆలోచిస్తుంటుంది. టాలెంట్‌తో ఓ రేంజ్‌కి వెళ్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి అంటూ టొవినో థామస్ చెప్పిన మాటలు ఇప్పుడు గ్లామర్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి.

తెలుగులో ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను అలరించిన కృతి శెట్టి ఇప్పుడు తమిళ్, మలయాళంలో బిజీ అవుతున్నారు. అయినా తనకు టాలీవుడ్ పుట్టిల్లులా అనిపిస్తోందని చెబుతున్నారు ఈ బ్యూటీ. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ప్రమోషన్లను పూర్తి చేశాక హైదరాబాద్‌కి వస్తే.. ఇంటికొచ్చినట్టుంది అని చెబుతున్నారు.

తాను ఏ భాషలో సినిమా చేసినా, అవి తెలుగులో విడుదలైనప్పుడు, ఇక్కడి వారు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందంటున్నారు కృతి శెట్టి. ఉప్పెన మూవీతో వచ్చిన క్రేజ్‌ని మళ్లీ సొంతం చేసుకుంటాననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది కృతిలో. దానికి తోడు ఇప్పుడు టొవినో చెప్పిన మాటలు మరింత బూస్ట్ ఇస్తున్నాయంటున్నారు ఈ భామ.




