- Telugu News Photo Gallery Mango seeds: surprising benefits of Mango Seeds and ways to add it to your diet
Mango Seeds: మామిడి టెంకలు పడేస్తున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి
వేసవి కాలం అంటేనే మామిడికాయల కాలం. మామిడి పండ్లను చిన్న పిల్లల నుండి పెద్ద వరకు అందరూ ఇష్టపడతారు. పచ్చి, పండిన పండ్లు అందరూ ఎంతో ఇష్టం తింటారు. అందుకే మామిడిని పండ్లలో రారాజు అంటారు. చూడగానే తినాలని అనిపిస్తుంది. పండిన మామిడి శరీర బరువును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది..
Updated on: Jun 27, 2024 | 9:21 PM

వేసవి కాలం అంటేనే మామిడికాయల కాలం. మామిడి పండ్లను చిన్న పిల్లల నుండి పెద్ద వరకు అందరూ ఇష్టపడతారు. పచ్చి, పండిన పండ్లు అందరూ ఎంతో ఇష్టం తింటారు. అందుకే మామిడిని పండ్లలో రారాజు అంటారు. చూడగానే తినాలని అనిపిస్తుంది. పండిన మామిడి శరీర బరువును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మామిడి రుచి గురించి అందరికీ తెలిసిందే. అయితే మీకు తెలుసా? మామిడి పండు మాత్రమే కాదు, మామిడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయట. మామిడి పండు తిన్న తర్వాత టెంక పడేడయటం మనందరికీ అలవాటే. కానీ ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుల ప్రకారం.. మామిడి గింజలను సమర్థవంతమైన మూలికా ఔషధంగా పరిగణిస్తారు.

అధిక రక్తపోటును తగ్గించడంలో మామిడి విత్తనం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే రక్తహీనత, తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు మామిడి విత్తనం తినకూడదు. అప్పుడు రక్తపోటు స్థాయి మరింత తగ్గే ప్రమాదం ఉంది.

మామిడి గింజలు వివిధ వైరస్లు, బ్యాక్టీరియా నుండి మనలను రక్షించడంలో సహాయపడతాయి. ఫలితంగా దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మామిడి గింజలు ఉపయోగకరంగా ఉన్నా వీటిని నేరుగా తినలేం. మామిడి గింజలను రుబ్బుకుని, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో మింగితే ప్రయోజనం ఉంటుంది.

మామిడి గింజలు అధిక రక్తపోటు రోగులకు మేలు చేస్తాయి కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి గింజలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు.





























