- Telugu News Photo Gallery Technology photos Google chrome introduces new feature listen to this page click here for full details
Google: ఇకపై వెబ్ పేజీని వినొచ్చు.. క్రోమ్‌లో అదిరిపోయే ఫీచర్
ఒకప్పుడు బ్రౌజింగ్ అంటే కేవలం కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్. కానీ ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిందో. పీసీ మాదిరిగానే స్మార్ట్ ఫోన్‌లో కూడా సింపుల్‌గా బ్రౌజింగ్ చేసుకునే అవకాశం లభించింది. ఇందులో భాగంగానే గూగుల్ క్రోమ్ తాజాగా ఆండ్రాయిడ్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటా ఫీచర్.? దాంతో లభించే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 27, 2024 | 8:48 PM

స్మార్ట్‌ఫోన్స్‌లో గూగుల్ క్రోమ్ ఉపయోగించే వారి కోసం అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చారు. లిజన్ టు దిస్ పేజ్ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. పేరుకు తగ్గట్లుగానే ఈ ఫీచర్ సహాయంతో వెబ్ పేజీని వినొచ్చు.

మీరు ఏదైనా సమచారం కోసం వెబ్ పేజీలో బ్రౌజ్ చేస్తే. అందులో టెక్ట్స్ రూపంలో ఉన్న కంటెంట్‌ను ఈ పేజీ మీకు చదివి వినిపిస్తుంది. ఈ ఫీచర్ సహాయంతో మీరు వెతికే కంటెంట్‌ను పలు భాషల్లో వినే అవకాశం కల్పించారు. స్క్రీన్ లాక్‌లో ఉన్నా ఆడయో వినిపిస్తూనే ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ అరబిక్, బెంగాలీ, చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, జపనిస్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ వంటి భాషల్లో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం కేవలం కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ పరిచయం చేయనున్నారు.

ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలనేగా. ఇందుకోసం ముందుగా స్మార్ట ఫోన్‌లోని క్రోమ్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం మీరు చూడాలన్నకుంటున్న పేజీని ఓపెన్ చేయాలి. పేజీ పూర్తిగా లోడ్ అయ్యే వరకు చూసి. ఆ తర్వాత రైట్ సైడ్ టాప్‌లో కనిపించే.. పేజీ నిలువు మూడు చుక్కల మీద క్లిక్ చేయాలి.

వెంటనే కనిపించే మెనూలో లిజన్ టు దిస్ పేజ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దీంతో కంటెంట్ చదవడం ప్రారంభమవుతుంది. మినీ ప్లేయర్‌పై క్లిక్ చేస్తే ప్లేబ్యాక్ స్పీడ్‌ను మార్చుకోవచ్చు. ఇక వాయిస్ ఆప్షన్‌ను క్లిక్ చేసి మీకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు





























