- Telugu News Photo Gallery Technology photos ZTE launches world’s first AI naked eye 3D mobile phone ZTE Voyage 3D features and price details
ZTE Voyage 3D: మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్ ఫోన్.. ఆ ఫీచర్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదే
మారుతోన్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారుతోంది. రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సందడి చేస్తోంది. అధునాతన సాంకేతికతతో కూడిన ఫోన్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ జెట్‌టీఈ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ZTE Voyage 3D పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు..
Updated on: Jun 27, 2024 | 7:58 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ZTE మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ZTE Voyage 3D పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ప్రపంచంలోనే తొలి ఏఐ నేక్‌డ్ ఐ 3డీ మొబైల్ ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోది. అంటే ఈ ఫోన్ డిస్‌ప్లే అచ్చంగా 3డీ డిస్‌ప్లేలాగా పనిచేస్తుందన్నమాట.

ఒక్క క్లిక్‌తో 2డీ స్క్రీన్‌ను 3డీ లోకి మార్చుకునే అవకాశం కల్పించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. వాయిస్ ట్రాన్స్‌లేషన్, ఏఐ ఇంటెలిజెంట్ వాయిస్ అసిస్టెంట్, చాట్ డైలాగ్ వంటి అధునాతన ఫీచర్లు ఈ ఫోన్ సొంతం.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.58 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ 3డీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ ఫోన్ అక్టా కోర్ యూనిసోక్ టీ760 6ఎన్‌ఎమ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను సైడ్‌కు అందించారు.

ఇక ఈ ఫోన్‌లో 33 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5జీ, వైఫై 802.11ac, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సీ వంటి ఫీచర్లను అందించారు. అయితే ఇన్ని ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి ధర ఎక్కువేమో అనుకుంటే పొరబడినట్లే ఎందుకంటే ఈ ఫోన్ ధర రూ. 17,225గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.





























