AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లోనే అత్యంత పరిశుభ్రమైన నగరం.. ఒక్క ఏడాదిలోనే టాప్ 3కి..

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 జాబితాను ఇటీవలే విడుదల చేశారు. ఇందులో దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం గుజరాత్‌లోని అహ్మదాబాద్ నిలవగా.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరం ఈ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఉత్తరప్రదేశ్‌లోని లక్నో మూడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ విషేశం ఏమిటంటే.. లక్నో ఏడాదిలోనే 44వ స్థానం నుంచి మూడో స్థానికి చేరుకుంది.

Anand T
|

Updated on: Jul 23, 2025 | 11:17 AM

Share
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 జాబితాను విడుదల చేసింది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరం గుజరాత్‌లోని అహ్మదాబాద్. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరం మొదటి, రెండవ స్థానాలను దక్కించుకున్నాయి. అయితే గతేడాది ఐదవ స్థానంలో ఉన్న భోపాల్‌ ఈసారి రెండవ స్థానంలో నిలిచింది.

1 / 5
అయితే ఈ సర్వే జాబితాలో మూడో ప్లేస్‌లో నిలిచిన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో అద్భుతం సృష్టించింది. లక్నో దేశంలోనే మూడవ క్లీనెస్ట్‌ సిటీగా అవతరించింది. అయితే ఇక్కగ ప్రశంసించ దగ్గ విషయం ఏమిటంటే.. గతేడాది 44 స్థానంలో ఉన్న లక్నో ఏడాదిలో ఏకండా 41 నగరాలను వెనక్కి నెట్టి ఈ సారి మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

2 / 5
లక్నో ఏడాదిలోనే 41 నగరాలను వెనక్కి నెట్టి మూడో ప్లేస్‌కు చేరుకోవడంతో ఆ నగర వాసుల కృషి ఎంతగానో ఉంది. లక్నో ప్రజల్లో పరిశుభ్రత గురించి పెరిగిన అవగాహన వల్లే ఇది సాధ్యమైంది. సంవత్సరాలుగా పరిశుభ్రత విషయంలో వెనుకబడిన నగరం ఇప్పుడు మొత్తం దేశానికే ఒక అదర్శంగా నిలిచింది.

3 / 5
లక్నో మున్సిపల్ శాఖ బృందం నగరంలో చేపట్టిన పరిశుభ్రత అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ పర్యవేక్షణలు లక్నో నగర రూపురేకలను మార్చివేశాయి. ఏడాదిలోనే లక్నోను దేశంలోని టాప్ 3 పరిశుభ్రమైన నగరాల జాబితాలో చేర్చాయి.

4 / 5
దీన్ని బట్టి చూస్తే లక్నో నగరాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మార్చడమే లక్నో ప్రజల లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే, వారు లక్నో పేరును ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీని కోసం, క్రమం తప్పకుండా శుభ్రపరచడం, అవగాహన ప్రచారాలు ప్రతిచోటా నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సంఖ్యను మరింత ముందుకు తీసుకెళ్లేలా నగరవాసులు కృషి చేస్తున్నారు.

5 / 5