- Telugu News Photo Gallery Know type of rice which director Puri Jagannath eats daily, it is Rajamudi rice
Puri Jagannath: పూరి జగన్నాథ్ తినే ఈ దేశీ బియ్యం రకం గురించి తెలుసా..? ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Rajamudi rice: సంచలన సినిమాలకు దర్శకత్వం వహించిన.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన podcast లో ఒక దేశి వరి పంట గురించి మాట్లాడారు. ఒకప్పుడు భారతదేశంలో లక్షకుపైగా వరి వంగడాలు ఉండేవని ఇప్పుడు అవి అంతరించి కేవలం 6 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పుకుంటూ..
Updated on: Jul 18, 2023 | 2:00 PM

Puri Jagannath

దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తావించిన ఈ బియ్యం పేరు రాజముడి. ఈ రకం వంగడం కర్ణాటక ప్రాంతంలోని రైతులు పండించేవారు. పూర్వం మైసూర్ ప్రాంతంలో రైతులు పన్నుల బద్దలు ఈ బియ్యాన్ని రాజుకు చెల్లించే వారు. రాజుకు చెల్లించడం ద్వారా దీనికి రాజముడి అనే పేరు వచ్చింది.

పోషకాహార ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందడంతో పాటు పన్నుల బదులు ఈ బియ్యం తీసుకోవడంతో దీనికి మరింత విలువ పెరిగింది. చాలా రకాల బియ్యాలు అంతరించిపోయిన ఈ వంగడం మాత్రం కాపాడుకుంటూ ముందుకు తీసుకుని వచ్చారు.

రాజముడి అన్నం ప్రయోజనాలు: ఎరుపు రంగులో ఉండేవి ఈ బియ్యం మిగతా రకాల జిగుటుగా ఉండవు. మిగతా ఎర్ర రకం బియ్యాల కన్నా సులువుగా వండవచ్చు.. మంచి డైటరి ఫైబర్ మరియు పోషక పదార్థాలు, zinc, calcium కలిగి ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి.

రాజముడి బియ్యంలో antioxidants, phytonutrients ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడడం, తక్కువ GI ఉండడం రాజముడి బియ్యం ప్రత్యేకత.. షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా తమ డైట్లో ఈ రైస్ ని తీసుకోవచ్చు.

అయితే, రాజముడి బియ్యం ఎవరైనా తినొచ్చు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.. (Note: ఇది కేవలం అందుబాటులో ఉన్న సమాచారంతో రాసిన వార్త. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మీ డాక్టర్ ను సంప్రదించి నిర్ణయం తీసుకోండి)




