- Telugu News Photo Gallery Know these are the romantic places are best for summer season must visit with partner
Tourist Places : వేసవిలో మీ భాగస్వామితో కలిసి ఈ ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయ్యోచ్చు..బెస్ట్ రొమాంటికి ప్లేసెస్ ఇవే..
Tourist Places : వేసవిలో తమ భాగస్వామితో కలిసి టూర్స్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ అందుకు అనువైన ప్రదేశాల గురించి చాలా మందికి తెలియవు. మీ భాగస్వామితో కలిసి టూర్ వెళ్లాలనుంటే ఈ ప్రదేశాలు బెస్ట్.
Updated on: Apr 14, 2022 | 12:25 PM

కొన్నిసార్లు సీజన్ ప్రకారం హనీమూన్ కోసం ఒక స్థలాన్ని ఎంచుకోవడం చాలా కష్టం అవుతుంది.. కానీ తమ భాగస్వామితో కలిసి టూర్ వెళ్లడానికి ఈ ప్రదేశాలు బెస్ట్.

మనాలి - హిమాచల్ ప్రదేశ్‌లో మనాలి ఉత్తమ హనీమూన్ ప్లేస్. పర్వతాలు, పూలు, తోటల మధ్య మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం కలిసి టూర్ ఎంజాయ్ చేయవచ్చు.. ఇక్కడ ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, క్యాంపింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.

మనాలి - హిమాచల్ ప్రదేశ్‌లో మనాలి ఉత్తమ హనీమూన్ ప్లేస్. పర్వతాలు, పూలు, తోటల మధ్య మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం కలిసి టూర్ ఎంజాయ్ చేయవచ్చు.. ఇక్కడ ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, క్యాంపింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.

గుల్మార్గ్ - జమ్మూ, కాశ్మీర్‌లో ఉన్న గుల్మార్గ్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గం కంటే తక్కువ కాదు. ఇక్కడ దాల్ సరస్సు, పూలతో నిండిన మైదానాలు, అందమైన పర్వతాలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇది చాలా అందమైన ప్రదేశం. మీ భాగస్వామితో కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి తప్పనిసరిగా ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి.

ఊటీ - ఇది చాలా ప్రశాంతమైన ప్రదేశం. ఇక్కడ సహజమైన ప్రకృతిని చూడవచ్చు. ఊటీ తమిళనాడులో ఉంది. ఇక్కడ కామరాజ్ సాగర్ లేక్, ఊటీ లేక్, బొటానికల్ గార్డెన్ వంటి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. మీరు మీ భాగస్వామితో ప్రశాంతమైన క్షణాలను గడపవచ్చు.

వేసవిలో తమ భాగస్వామితో కలిసి టూర్స్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ అందుకు అనువైన ప్రదేశాల గురించి చాలా మందికి తెలియవు. మీ భాగస్వామితో కలిసి టూర్ వెళ్లాలనుంటే ఈ ప్రదేశాలు బెస్ట్.




