- Telugu News Photo Gallery Why Does A Colored Soap Produce White Foam Know The Science Behind It Telugu
Soap Foam: రంగు రంగుల సబ్బులు.. అయినా నురుగ మాత్రం తెల్లగానే..! ఎందుకో తెలుసా..
Soap foam color: మార్కెట్లో ప్రస్తుతం రకరకాల సబ్బులు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి ఇష్టమొచ్చిన సబ్బులను వారు ఉపయోగిస్తున్నారు. అయితే.. రకరకాల రంగుల సబ్బులు వినియోగిస్తున్నాం.. కానీ వాటి నుంచి వచ్చే నురుగ ఎందుకు తెల్లగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.?
Updated on: Apr 14, 2022 | 12:02 PM

Soap foam colour: మార్కెట్లో ప్రస్తుతం రకరకాల సబ్బులు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి ఇష్టమొచ్చిన సబ్బులను వారు ఉపయోగిస్తున్నారు. అయితే.. రకరకాల రంగుల సబ్బులు వినియోగిస్తున్నాం.. కానీ వాటి నుంచి వచ్చే నురుగ ఎందుకు తెల్లగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.? సబ్బు రంగు రంగులో ఎందుకు ఉండదు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం.. సైన్స్. సబ్బుతో చేతులు కడుక్కున్న తర్వాత తెల్ల రంగు మాత్రమే ఎందుకు వస్తుంది.. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏ వస్తువుకి దాని స్వంత రంగు లేదని శాస్త్రం చెబుతోంది. వస్తువుల రంగులు కనిపించడానికి కాంతి కిరణాలే కారణం. ఏదైనా కాంతి కిరణాలన్నింటినీ గ్రహిస్తే అది నల్లగా కనిపిస్తుంది. అదే సమయంలో కాంతి కిరణాలన్నీ ప్రతిబింబించినప్పుడు తెల్లగా కనిపిస్తుంది. నురుగు విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇదే కాకుండా సబ్బులో ఉపయోగించే రంగు చాలా ప్రభావవంతంగా ఉండదు.

ఏథెన్స్ సైన్స్ నివేదిక ప్రకారం.. సబ్బు రంగు ఏదైనా.. దాని నుంచి నురుగ ఏర్పడినప్పుడు అందులో నీరు, గాలి, సబ్బు రసయనాలు ఉంటాయి. ఇవి గుండ్రని ఆకారంలో ఉండి బుడగలు రూపంలో కనిపిస్తాయి. కాంతి కిరణాలు వాటిపై పడినప్పుడు.. అవి ప్రతిబింబిస్తాయి. ఇలా జరిగినప్పుడు ఈ బుడగలు తెల్లగా కనిపిస్తాయి. అందుకే సబ్బు రంగు ప్రభావం కనిపించదని పేర్కొంటున్నారు.

సోప్ నుంచి ఏర్పడే చిన్న బుడగలు పారదర్శకంగా తయారవుతాయని సైన్స్ చెబుతోంది. అయితే కాంతి కిరణం వాటిపై పడినప్పుడు, అన్ని రంగులు ప్రతిబింబిస్తాయి. సైన్స్ ప్రకారం.. ఇలా జరిగినప్పుడు ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది. సబ్బు ఆకుపచ్చగా లేదా పసుపు రంగులో ఉన్నప్పటికీ నురుగ తెల్లగా మారడానికి ఇదే కారణం.

ఇదే.. నియమం సముద్రాలు, నదులకు కూడా వర్తిస్తుంది. సముద్రం లేదా నదులు నీలం రంగులో ఉండటాన్ని మనం తరచుగా చూస్తాం.. కానీ మీరు దగ్గరగా వెళ్లి నీటిని చూసినప్పుడు దాని రంగు నీలంలో కనిపించదు. వాస్తవానికి నీటికి సూర్యకిరణాలను గ్రహించే శక్తి ఉంది. పగటిపూట సూర్యకిరణాలు నీటిపై పడినప్పుడు.. నీరు కాంతి నుంచి వచ్చే ఇతర రంగుల కిరణాలను గ్రహిస్తుంది. దీంతో నీలి కిరణాన్ని ప్రతిబింబిస్తుంది. కాంతి ఈ ప్రతిబింబం కారణంగా సముద్రం రంగు నీలం రంగులో కనిపిస్తుంది.

అందుకే సబ్బు రంగు ఎరుపు-పసుపు లేదా ఆకుపచ్చ-నీలం అయినా నురుగ తెల్లగా వస్తుందని పేర్కొంటున్నారు.





























