అరటిపండు తినడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. ఇది రుచికరమైనదే కాకుండా, అనేక ప్రయోజనకరమైన లక్షణాలను కూడా కలిగి ఉంది. శక్తి అధికంగా ఉండే ఈ పండును తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఇందులో విటమిన్ ఎ, బి, సి, బి6 తోపాటు.. డైటరీ ఫైబర్, మాంగనీస్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అరటిపండును సూపర్‌ఫుడ్‌గా కూడా పరిగణిస్తారు. ఇది అలసట, బలహీనతను తొలగిస్తుంది. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. మన రోగనిరోధక శక్తి నుంచి లైంగిక సామర్థ్యాన్ని పెంచడం వరకు అరటిపండ్లు ఎక్కువగా సహాయపడతాయి. అందుకే.. ఆరోగ్యానికి మేలు చేసే అరటిపండ్లను క్రమం తప్పకుండా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండును షేక్, చిప్స్, కూరగాయల రూపంలో కూడా తినవచ్చు. ముఖ్యంగా.. ఇవి ఏ సీజన్‌లోనైనా సులభంగా దొరుకుతాయి. అంతేకాకుండా.. అనేక ఇతర పండ్ల కంటే చౌకగా లభిస్తాయి. అయితే, రోజుకు ఒకటి లేదా రెండు అరటి పండ్లను తినవచ్చు. అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..