Kitchen Tips: మాల్ నుంచి భారీ మొత్తంలో ఆహారపదార్దాలు కొనుగోలు చేస్తున్నారా.. పొరపాటున కూడా వీటిని కొనవద్దు..
వంటింట్లో ఉండే వస్తువుల కోసం రోజు రోజు దుకాణాల దగ్గరకు వెళ్ళడానికి కొందరు ఇష్టపడరు. ఇంకా చెప్పాలంటే పప్పులు, మసాలాలు వంటివి కొనుగోలు చేయడానికి ఇలా దుకాణానికి వెళ్లడం సాధ్యం కాదు. కనుక ఎక్కువ పరిమాణంలో ఒకేసారి కొనుగోలు చేస్తారు. పచ్చి కూరగాయలు, చేపలు, మాంసం వంటివి తాజావి కొనుగోలు చేసుకోవాలి. నెలలో ఒక రోజు కిరాణా సామాను తీసుకోవడానికి కేటాయిస్తారు. అయితే అన్ని ఆహారాలను నెలలో ఒకేసారి కొనుగోలు చేయవద్దు.
Updated on: Sep 24, 2023 | 1:19 PM

పప్పులు, మసాలాలు కొనేందుకు ప్రతివారం దుకాణానికి వెళ్లే సమయం అందరికి ఉండదు. దీంతో ఒకేసారి అధిక మొత్తంలో కొనుగోలు చేస్తారు. నెలకి కావాల్సిన కిరాణా సామాన్లు కొని భద్రపరిచినా పాడవుతుందనే భయం ఉండదని చాలా మంది అనుకుంటారు. అయితే ఒకేసారి భారీ మొత్తంలో కొనుగోలు చేస్తే వాటి నాణ్యత కోల్పోతాయి.

రోజూ చేసే వంటలో కారం, పసుపు పొడి, జీలకర్ర, కొత్తిమీర, మిరియాలు, బే ఆకు వంటి అనేక సుగంధ ద్రవ్యాలు అవసరం. వీటిని తక్కువ పరిమాణంలో కొనుగోలు చేయలేము. అయినప్పటికీ ఎక్కువగా పరిమాణంలో మాత్రం వీటిని కొనకూడదు. ఎందుకంటే ఈ పదార్ధాలోని సుగంధ ద్రవ్యాల నాణ్యత లోపిస్తుంది.

కుటుంబం మొత్తానికి ప్రతి నెల 5 లీటర్ల నూనె అవసరమని ఒకేసారి నూనెను కొనుగోలు చేస్తారు. అయితే ఈ తప్పు చేయవద్దు. నూనెను ఎక్కువ కాలం నిల్వ ఉంచినట్లయితే.. దాని నాణ్యత క్షీణిస్తుంది. ఒక్కోసారి 1-2 లీటర్ల కంటే ఎక్కువ నూనె కొనకూడదు.

పాలను రెండు రోజులకు మించి ఫ్రిజ్‌లో ఉంచితే అవి కూడా పాడైపోతాయి. అంతేకాదు భారీ మొత్తంలో పాల ఉత్పత్తులను ఒకేసారి కొనుగోలు చేసి నిల్వ చేయకూడదు. మీరు ఆరోగ్యం గురించి ఆలోచిస్తే ఎప్పటి కప్పుడు ఇంకా చెప్పాలంటే ఏ రోజుకారోజు పాలు, పెరుగు కొనడం మంచిది.

వాల్‌నట్‌లు, బాదం, జీడిపప్పు వంటి గింజలు, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తారు. నెల మధ్యలో మార్కెట్‌కు వెళ్లకుండా ఉండేందుకు ఇలా నెలకి సరిపడా కొనుగోలు చేస్తారు. ఇలా ఒకేసారి కొనుగోలు చేయడం వలన వాటి రుచిలో తేడా వస్తుంది.

గోధుమ, శనగ పిండి వంటి వాటిని నెల మొత్తానికి కావలసినంత కొనుగోలు చేస్తారు. ఇలా పిండిని ఏక మొత్తంలో కొనుగోలు చేస్తుంటే ఈ పొరపాటును నివారించండి. పిండిని తక్కువ పరిమాణంలో కొనుగోలు చేసి గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.

రెడీ మేడ్ రొట్టెలను లేదా బ్రెడ్ వంటి వాటిని చాలామంది ఒకేసారి కొనుగోలు చేస్తారు. అయితే ఇలా రొట్టెలను, బ్రెడ్ ను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. బ్రెడ్ ను ఏరోజుకారోజు కొని తింటే మంచిది. అంతే కాకుండా ఒకేసారి ఎక్కువ తృణధాన్యాలు కొనకపోవడమే మంచిది.





























