AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruits Peel: తొక్కే కదాని తీసి పారేస్తే ఎంత నష్టపోతారో తెలుసా? ఇలా వాడేస్తే డబ్బు ఆదా చేయొచ్చు

పండ్లు, కూరగాయలపై ఉండే తొక్కలు తీసి పారేస్తున్నారా? ఇకపై అలా చేయకండి. వీటివల్ల కూడా బోలెడు లాభాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఇక ఎప్పుడూ తొక్కలు పారేయరు..

Srilakshmi C
|

Updated on: Dec 08, 2024 | 1:22 PM

Share
వంట వండేటప్పుడు సాధారణంగా కూరగాయలను తొక్క తీసి వాడతాం. అలాగే కొన్ని పండ్లను తినే సమయంలో తొక్కలు తీసి తింటాం. అయితే, కూరగాయలు, పండ్ల తొక్కలు తీసిన తర్వాత వాటిని వృధాగా పడేయడం కంటే ఈ కింది పద్ధతుల్లో తొక్కలను కూడా ప్రయోజనకంగా వాడుకోవచ్చు. నిజానికి ఈ తొక్కలు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని వివిధ మార్గాల్లో ఉపయోగించవచ్చు.

1 / 5
బంగాళదుంపలను వివిధ వంటల తయారీలో ఉపయోగిస్తాం. కానీ మనం బంగాళాదుంప తొక్కను పనికిరానిదిగా విసిరివేస్తాం. ఇందులో విటమిన్లు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బంగాళాదుంప తొక్కను 10 నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, చల్లబడిన తర్వాత కళ్ల చుట్టూ అప్లై చేసి, పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కళ్లను కడగాలి. ఇలా చేయడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు తొలగిపోతాయి

2 / 5
ఆరెంజ్ తొక్కలో కూడా వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తొక్క లోపలి భాగంతో దంతాలను స్క్రబ్ చేయడం వల్ల పసుపుపచ్చ దంతాలు తెల్లగా మారుతాయి. ఇది పంటి ఎనామిల్‌కు మంచిది. అంతే కాకుండా నారింజ తొక్క కూడా సహజసిద్ధమైన క్రిమి సంహారిణి కావడంతో దాని వాసనకు క్రిములు కూడా రావు.

3 / 5
యాపిల్ తొక్కలో విటమిన్ ఇ అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది. ఇందులో ఉండే కొల్లాజెన్ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. యాపిల్ తొక్కను ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమల వంటి సమస్యలు కూడా నయమవుతాయి.

4 / 5
దోసకాయ తొక్కను ముఖానికి రాసుకోవడం వల్ల కూడా గ్లో పెరుగుతుంది. ఇది చర్మంపై విష రసాయనాలను తొలగించడానికి దోసకాయ గుజ్జును ఉపయోగించవచ్చు. అలాగే అరటిపండు తిని తొక్కను విసిరేసే బదులు, షూలను పాలిష్ చేయడానికి ఉపయోగించవచ్చు. అరటిపండు తొక్క లోపలి భాగాన్ని బూట్లపై రుద్దడం వల్ల బూట్లపై ఉన్న మురికి, దుమ్ము శుభ్రపడి మెరుస్తుంది.

5 / 5