నిమ్మరసం: నిమ్మరసం ఆరోగ్యానికే కాక పాత్రలను శుభ్రంగా ఉంచడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా పాత్రలపై ఉండే సూక్ష్మ జీవులను సమూలంగా నిర్మూలించడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు 4, 5 టీ స్పూన్ల బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి బాగా కలిపితే చాలు. తర్వాత ఆ పేస్ట్‌తో పాత్రలను కడగవచ్చు.