Telugu News Photo Gallery Karnataka woman built a library for students writing competitive exams with the money of gruha lakshmi
అమ్మ మనసు వెన్న.. గృహలక్ష్మి సొమ్ముతో పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం లైబ్రరీ కట్టించింది.. ఎక్కడంటే
ప్రభుత్వం మహిళల సాధికారిక కోసం ఎన్నో ప్రయోజనకమైన పథకాలను తీసుకొచ్చింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నికల్లో విజయం సాధించడానికి మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలను ఇస్తారు. డ్వాక్రా మహిళలకు పొడుపు పధకం, పిల్లలు స్కూల్ కు వెళ్తే మహిళల ఖాతాలో డబ్బులు జమ వంటివి అనేకం ఉన్నాయి. అలా వచ్చిన డబ్బులతో ఎక్కువ మంది మహిళలు బంగారం నగలు, రకరకాల వస్తువులను కొనడమో లేదా వడ్డీకి డబ్బులను ఇవ్వడమో చేస్తూ ఉంటారు. అయితే కర్నాటకకు చెందిన ఓ మహిళా మాత్రం అందరి కంటే భిన్నంగా ఆలోచించింది. తన ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన డబ్బులతో విద్యార్ధుల కోసం ఏకంగా గ్రంథాలయాన్ని కట్టించింది.