Kalojeraa Benefits: చెడు కొలెస్ట్రాల్, కొవ్వును తొలగిస్తుంది.. ఆరోగ్యానికి ఓ వరం నల్ల జీలకర్ర..

భారతీయుల వంట ఇల్లే ఒక ఔషధాల గని. అందులో జీలకర్ర ఒక ఔషధం. ప్రతి ఇంట్లోనూ దాదాపు ఉపయోగిస్తారు. అయితే జీలకర్ర బదులు నల్ల జీలకర్ర వలన మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో నల్ల జీలకర్రకు అద్భుతమైన మూలికగా పిలువబడుతుంది. వీటిని కలోంజీ విత్తనాలు అని కూడా అంటారు. నల్ల జీలకర్రలో చాలా ఫైబర్, విటమిన్లు, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, ఇతర పోషకాలు ఉన్నాయి.

Surya Kala

|

Updated on: Jun 27, 2024 | 1:01 PM

ఈ విత్తనాలు 3000 సంవత్సరాల చరిత్రను కలిగి నల్ల జీలకర్ర బహుళ పోషకాలతో నిండి ఉంటుంది. ఈ నల్ల జీలకర్రను నూనే, కషాయంగా ఉపయోగిస్తారు. అంతేకాదు వివిధ రకాల ఆహార పదార్ధాల తయారీ లో కూడా ఉపయోగిస్తారు.

1 / 5
అర చెంచా నల్ల జీలకర్రను ఒక చెంచా తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేదా నల్ల జీలకర్రను ఒక కప్పు వేడి నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగవచ్చు. ఇలా చేయడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.

2 / 5
నల్ల జీలకర్ర నీరు బొడ్డు కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. స్థూలకాయ సమస్య నుంచి బయటపడేందుకు ప్రతి రోజూ ఉదయం ఈ నీటిని సేవించండి. ఈ పానీయం మెదడుకు మేలు చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది.

3 / 5
నల్ల జీలకర్ర దంతాల నొప్పిని నయం చేయడానికి దివ్య ఔషధం. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి నల్ల జీలకర్ర నూనెను పెరుగుతో కలిపి రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా చిగుళ్ళకు అప్లై చేయండి.

4 / 5
నల్ల జీలకర్రను క్రమం తప్పకుండా తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కాలేయం వివిధ విధులకు కూడా సహాయపడుతుంది.

5 / 5
Follow us