- Telugu News Photo Gallery It is good to keep Laughing Buddha anywhere in the house, check here is details
Laughing Buddha: లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఎక్కడ ఉంచితే మంచిదంటే..
లాఫింగ్ బుద్ధా విగ్రహం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లాఫింగ్ బుద్ధా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది నవ్వుతూ ఉండే బుద్ధుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచడం వల్ల శాంతి, శ్రేయస్సు అనేది పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఇంట్లో ఈ విగ్రహం ఉంచడం కంటే.. ఏ దిశలో ఉంచాలి అన్నదే చాలా ముఖ్యం. ఇంట్లో సానుకూల శక్తిని..
Updated on: Sep 13, 2024 | 6:11 PM

లాఫింగ్ బుద్ధా విగ్రహం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లాఫింగ్ బుద్ధా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది నవ్వుతూ ఉండే బుద్ధుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.

ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచడం వల్ల శాంతి, శ్రేయస్సు అనేది పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఇంట్లో ఈ విగ్రహం ఉంచడం కంటే.. ఏ దిశలో ఉంచాలి అన్నదే చాలా ముఖ్యం. ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షించడానికి వాస్తు శాస్త్రం కొన్ని సూచనలు చేసింది.

లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని చాలా మంది కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ విగ్రహం సంపదకు దేవుడైన కుబేరుడిని సూచిస్తుందని విశ్వసిస్తారు. ఆనందం.. శ్రేయస్సు.. సమృద్ధికి.. ఈ విగ్రహం చిహ్నం. చైనాలో ఎక్కడ చూసినా ఈ విగ్రహం కనిపిస్తుంది.

ఈ విగ్రహానికి కుబేరుడికి ఎలాంటి సంబంధం లేదు. కానీ చాలా మంది ఈ విగ్రహాన్ని తమ ఇంటి వైభోగం కోసం పెంచుకుంటున్నారు. ఇంట్లో ఈ విగ్రహం ఉంటే సంపద, ఆనందాన్ని ఆకర్షిస్తుంది.

నవ్వుతున్న బుద్ధుడిని ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచుకుంటే చాలా మంచిది. తూర్పు దిశలో కూడా ఉంచుకోవచ్చు. ఇక్కడ ఉంచడం వల్ల కుటుంబ సామరస్యం కూడా పెరుగుతుంది. విభేదాలు అనేవి తగ్గుతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది.




