తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయ్... బీ ఎలర్ట్ అంటూ టీ-సర్కార్‌కు హెచ్చరించింది హైకోర్టు. కొవిడ్ కేసులపై విచారణ జరిపిన హైకోర్టు, పరీక్షల సంఖ్య పెంచాల్సిందే అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరిస్థితిపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని చెబుతూ, విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది హైకోర్టు.