AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరుధాన్యాలతో ‘మిల్లెట్ భారత్’.. స్వాతంత్ర్య దినోత్సవానికి జడ్చర్ల విద్యార్థుల వినూత్న కానుక

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్లలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో వినూత్నంగా ‘మిల్లెట్ భారత్’ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. కళాశాలలో ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసిన AEDP కోర్సు అయిన హార్టికల్చర్ విభాగం విద్యార్థులు వివిధ రకాల చిరుధాన్యాలను ఉపయోగించి భారతదేశ పటాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు.

Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Aug 14, 2026 | 9:16 PM

Share

1 / 5
చిరుధాన్యాల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర వ్యవసాయం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నెల రోజులుగా హార్టికల్చర్ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు ఎంతో ఆసక్తి, అంకితభావంతో పనిచేసి పచ్చదనంతో కళకళలాడే ‘మిల్లెట్ భారత్’ను రూపొందించారు. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, వరిగలు తదితర చిరుధాన్యాల ప్రాధాన్యతను ఈ చిత్రపటం ద్వారా చాటి చెప్పారు.

2 / 5
చిరుధాన్యాలు మనిషికి పోషకాహారాన్ని అందించడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైన పంటలుగా నిలుస్తాయని తెలంగాణ బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య పేర్కొన్నారు. అనేక పశుపక్ష్యాదులకు కూడా చిరుధాన్యాలు మంచి ఆహార వనరుగా ఉపయోగపడతాయని తెలిపారు.

3 / 5

‘సస్యశ్యామల భారతదేశం – ఆరోగ్యకరమైన భారతదేశం’ అనే సందేశాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లడమే ‘మిల్లెట్ భారత్’ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. విద్యార్థుల్లో కష్టపడే తత్వం, సృజనాత్మకత, బృంద స్ఫూర్తి, ప్రకృతి పట్ల బాధ్యతను పెంపొందించేందుకు ఇలాంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

4 / 5
ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ‘మిల్లెట్ భారత్’ విద్యార్థులు, కళాశాల సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో హార్టికల్చర్ విద్యార్థులు, పరిశోధక విద్యార్థుల కృషి అమోఘమని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి సుకన్య, డా. సదాశివయ్య అభినందించారు.

5 / 5
Follow Us