- Telugu News Photo Gallery If you take the light thinking it's tamarind, you will lose those benefits
చింతపండుని లైట్ తీసుకుంటే.. ఆ ప్రయోజనాలు కోల్పోతారు.. జర భద్రం
బరువు తగ్గించేందుకు తీసుకునే ఆహారాల్లో చింతపండు ఉందని నిపుణులు చెబుతున్నారు. తరుచుగా చింతపండును తీసుకుంటే చాలా తొందరగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. చింతపండు లేనిదే భారతీయ వంటకాలు పూర్తి అవ్వవు. పుల్లగా ఉండే ఈ చింతపండులో ఎన్నో ఔషద గుణాలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. చింతపండులో ఉన్న ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Aug 27, 2025 | 12:38 PM

చింతపండులో మంచి కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఇ, కె, సి, బి1, బి2, బి5, బి3, బి6 తో పాటుగా సోడియం, ఐరన్, ఎనర్జీ, జింక్, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో సహాయపడతాయి.

చింతపండులో ఉండే హైడ్రక్సీ సిట్రిక్ యాసిడ్ మనలో ఫ్యాట్ ప్రొడక్షన్ను తగ్గిస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే హెచ్‌సీఏ ఫ్యాట్ నిల్వలకు కారణమయ్యే ఎంజైమ్స్‌కు అడ్డుగా నిలుస్తుంది. అందుకే దీన్ని మీ ఆహారంలో తప్పకుండ చేర్చుకోవాలని అంటున్నారు పోషకాహార నిపుణులు.

చింతపండు తీసుకొంటే వ్యాయామం చేస్తున్నప్పుడు కొవ్వు తొందరగా కరిగేందుకు కూడా ఇది ఎంతో సహాయపడుతుందట. బరువు తగ్గాలనుకొంటే తప్పకుండా ప్రతిరోజూ దీని తీసుకోండి. వర్కౌట్ చేసే వారి ఇది దివ్య ఔషదం అనే చెప్పాలి. అందుకే దీన్ని రోజు తీసుకోవడం మంచిది.

చింతపండును రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. చింతపండులో పాలీఫెనాల్స్, ఫ్లెవనాయిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు దీనితో మెటబాలిజం కూడా పెరుగుతుంది. తద్వారా ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీంతో మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

చింతపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ చింతపండు గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది.




