- Telugu News Photo Gallery If you mix pistachio with milk and drink it, there is no entry for illness
పాలలో పిస్తా కలిపి తాగితే.. ఇక అనారోగ్యానికి నో ఎంట్రీ..
ప్రస్తుత కాలంలో మానవాళిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. అటువంటి పోషకాలను అందించేవాటిలో పిస్తా పప్పులు కూడా ప్రముఖమైనవి. మరి పిస్తా పాలతో కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 03, 2025 | 9:35 PM

పిస్తాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బి6, ప్రొటీన్, కాల్షియం, ఐరన్ పెద్ద మొత్తంలో లభిస్తాయి. రోజూ పిస్తాపప్పును తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలోని షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండడంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. పిస్తా పాలతో కలిపి కూడా త్సిసుకోవచ్చు.

కండరాలు బలోపేతం: పిస్తాపప్పులు, పాలు కలిపి తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. ఎందుకంటే ఈ కాంబినేషన్‌లో కండరాలను బలోపేతం చేసే ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని రోజు తీసుకోవాలి.

ఎముకలు దృఢత్వం: పిస్తా పప్పులను పాలలో మరిగించి తింటే ఎముకలకు బలం చేకూరుతుంది. ఎందుకంటే పాలు పిస్తాలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు ఉపయోగకరంగా ఉంటుంది. పిస్తాలను పాలలో మరిగించడం వల్ల కీళ్ల నొప్పులు దూరమవుతాయి.

కళ్లకు ప్రయోజనాలు: మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో నిరంతరం పనిచేసే వ్యక్తుల కళ్లపై చెడు ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు పిస్తాలను పాలలో ఉడికించి తినవచ్చు. దీనివల్ల కళ్లకు మేలు జరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్: పిస్తా పాలు కలిపి తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. పాలలో ఉడకబెట్టిన లేదా నానబెట్టిన పిస్తా పప్పులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అలాగే అనేక రకాల పోషకాలు అందడం వల్ల దృఢంగా ఉండగలుగుతారు.




