- Telugu News Photo Gallery If you follow these tips, dandruff will not come back, check here is details
Dandruff Relief Tips: ఈ టిప్స్ పాటిస్తే తలలో డాండ్రఫ్ అనేది మళ్లీ రాదు..
ప్రస్తుత రోజుల్లో జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. జుట్టు రాలడం ఒకటే సమస్య కాదు.. డాండ్రఫ్ అధికంగా ఉండటం కూడా ఒక సమస్యే. చుండ్రు అనేది ఈజీగా తగ్గేది కాదు. చుండ్రు కారణంగా జుట్టు రాలడమే కాకుండా.. ముఖంపై పింపుల్స్ కూడా వస్తాయి. మరి ఏం చేస్తే చుండ్రు పోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్ సైడర్ వెనిగర్ సహాయంతో కూడా చుండ్రును తగ్గించుకోవచ్చు. కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా అప్లై చేయాలి. ఇలా ఓ పావు గంట సేపు ఉంచి..
Updated on: Sep 13, 2024 | 4:53 PM

ప్రస్తుత రోజుల్లో జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. జుట్టు రాలడం ఒకటే సమస్య కాదు.. డాండ్రఫ్ అధికంగా ఉండటం కూడా ఒక సమస్యే. చుండ్రు అనేది ఈజీగా తగ్గేది కాదు. చుండ్రు కారణంగా జుట్టు రాలడమే కాకుండా.. ముఖంపై పింపుల్స్ కూడా వస్తాయి. మరి ఏం చేస్తే చుండ్రు పోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్ సైడర్ వెనిగర్ సహాయంతో కూడా చుండ్రును తగ్గించుకోవచ్చు. కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా అప్లై చేయాలి. ఇలా ఓ పావు గంట సేపు ఉంచి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు తగ్గుతుంది.

అలాగే ఓ గుప్పెడు వేపాకులు తీసుకుని బాగా కడిగి.. పేస్టు చేసుకోవాలి. ఈ పేస్టును తలకు అప్లై చేయడం వల్ల కూడా మురికి, క్రిములు, చుండ్రు తగ్గిపోతుంది. ఇలా వారంలో రెండు సార్లు చేశారంటే.. చుండ్రు అస్సలు రానే రాదు.

చాలా మంది షాంపూతో తల స్నానం చేశాక.. సరిగా వాటర్ వేసుకోరు. దీంతో తల మీద మృత కణాలు, మురికి పేరుకుపోయి.. చుండ్రుగా తయారవుతుంది. కాబట్టి షాంపూ చేసిన తర్వాత తల పై నుంచి నీటిని బాగా వేసుకోవాలి.

ఆస్పిరిన్ ట్యాబ్లెట్లతోనూ చుండ్రు సమస్యను తగ్గించవచ్చు. ఈ ట్యాబ్లెట్లను ముక్కలుగా చేసి.. పొడిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే షాంపై వాడాలి. ఈ పొడిని తలకు బాగా పట్టించి.. ఓ ఐదు నిమిషాలు అయ్యాక తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చుండ్రు తగ్గుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




