- Telugu News Photo Gallery If you do these exercises you will come under sugar control try it Telugu News
షుగర్ నియంత్రణ చిట్కాలు.. ఈ వ్యాయామాలు ప్రయత్నించండి.. బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు..
మధుమేహం అనేది శరీరంలోని గ్లూకోజ్ నియంత్రణ వ్యవస్థలో లోపాల వల్ల వచ్చే వ్యాధి. ప్రస్తుతం చాలా మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని తప్పనిసరి నియమాలను పాటించటం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
Updated on: May 15, 2023 | 2:09 PM

మధుమేహం అనేది శరీరంలోని గ్లూకోజ్ నియంత్రణ వ్యవస్థలో లోపాల వల్ల వచ్చే వ్యాధి. ప్రస్తుతం చాలా మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వ్యాయామం చేయడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయండి. అంటే రోజుకు కనీసం 21 నిమిషాలు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

స్విమ్మింగ్: ఈత శరీరానికి ఉత్తమమైన వ్యాయామం. మధుమేహాన్ని నియంత్రించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అధ్యయనాల ప్రకారం, ఈత టైప్-1 మరియు టైప్-2 మధుమేహం రెండింటిలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది. స్విమ్మింగ్ రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది మరియు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

సైక్లింగ్: సైక్లింగ్ అనేది ఏరోబిక్ వ్యాయామం. ఇది గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది ఊబకాయం మరియు రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. 40 ఏళ్లలోపు వారికి, మధుమేహంతో బాధపడే వారికి సైకిల్ తొక్కడం మంచిది. ఉపయోగకరమైన వ్యాయామాలలో సైక్లింగ్ ఒకటని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

యోగా: యోగా ఒక సాధనంగా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి యోగా చాలా సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు ఎముకలను బలపరుస్తుంది. రోజూ అరగంట పాటు యోగా చేయడం వల్ల మధుమేహం సమస్య తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

వాకింగ్: నడక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయవలసిన వ్యాయామం. రోజూ వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహం సమస్యను అధిగమించడంలో జాగింగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.





























