- Telugu News Photo Gallery If you add these to your diet, uric acid will be controlled, check here is details in Telugu
Uric Acid: వీటిని మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే యూరిక్ యాసిడ్ మాయం అవుతుంది!
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకుంటేనే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ప్రస్తుత కాలంలో చాలా మందిని పట్టి పీడించే సమస్యల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. ఇప్పటికే యూరిక్ యాసిడ్ లక్షణాలు, జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు ఎలాంటి ఆహారాలతో యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్ చేయవచ్చో తెలుసుకుందాం. శరీరంలో యూరిక్ యాసిడ్‌ను తగ్గించేందుకు ధనియాల నీళ్లు చక్కగా హెల్ప్ చేస్తాయి. ప్రతి రోజూ పరగడుపున..
Updated on: May 13, 2024 | 7:42 PM

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకుంటేనే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ప్రస్తుత కాలంలో చాలా మందిని పట్టి పీడించే సమస్యల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. ఇప్పటికే యూరిక్ యాసిడ్ లక్షణాలు, జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు ఎలాంటి ఆహారాలతో యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్ చేయవచ్చో తెలుసుకుందాం.

శరీరంలో యూరిక్ యాసిడ్‌ను తగ్గించేందుకు ధనియాల నీళ్లు చక్కగా హెల్ప్ చేస్తాయి. ప్రతి రోజూ పరగడుపున కొన్ని రోజులు ధనియాల నీళ్లు తాగితే.. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది. అలాగే శరీరంలోని విష పదార్థాలు కూడా బయటకు తొలగిపోతాయి.

జామ కాయ తినడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు. జామకాయ తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జామ కాయ జ్యూస్ తాగినా పర్వాలేదు. అంతేకాకుండా శరీరంలో వచ్చే నొప్పి, మంటను కూడా తగ్గిస్తుంది.

యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సెలరీ చక్కగా పని చేస్తుంది. ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. యూరిక్ యాసిడ్ లెవల్స్ బాగా ఎక్కువగా ఉన్నవారు.. ఆకు కూరలను తినడం వల్ల యూరిక్ యాసిడ్ సులభంగా కంట్రోల్ అవుతుంది.

అదే విధంగా నారింజ, నిమ్మ, పచ్చకాయ, పత్తికుడి, ఖర్జూజ, యాపిల్ వంటి నీరు అధికంగా ఉండే పండ్లు తినడం వల్ల కూడా యూరిక్ యాసిడ్‌ను నియంత్రించవచ్చు. ఫైబర్ అధికంగా ఆహారాలు కూడా తీసుకుంటూ ఉండాలి. నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.




