- Telugu News Photo Gallery How To Increase Sperm Count Naturally: Ways and Best Foods To Boost Male Fertility
ఆ విషయంలో వీక్ అయ్యారా..? ఇవి తింటే పురుషులకు తిరుగుండదట..
ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అంతేకాకుండా.. చాలా మంది పురుషులు నేటి జీవనశైలి, ఆహారం కారణంగా సంతానోత్పత్తి సమస్యతో బాధపడుతున్నారు. ఇది కుటుంబాల్లో తీవ్ర ఆవేదనను మిగుల్చుతుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి పురుషులు చిన్నప్పటి నుండి చాలా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది.
Updated on: Jun 02, 2024 | 1:29 PM

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అంతేకాకుండా.. చాలా మంది పురుషులు నేటి జీవనశైలి, ఆహారం కారణంగా సంతానోత్పత్తి సమస్యతో బాధపడుతున్నారు. ఇది కుటుంబాల్లో తీవ్ర ఆవేదనను మిగుల్చుతుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి పురుషులు చిన్నప్పటి నుండి చాలా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది.. చదువులు, ఉద్యోగాల ఒత్తిడి కారణంగా తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేరు. అంతేకాకుండా.. పరిస్థితుల ప్రభావం కూడా వారిపై పడుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లయిన తర్వాత ప్రతి మగాడు తండ్రి కావాలని కోరుకుంటాడు. కానీ చాలాసార్లు అతను బలహీనమైన సంతానోత్పత్తి కారణంగా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి వారు కొన్ని ఆహారాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.. పురుషుల్లో సంతానోత్పత్తి, స్పెర్మ్ కౌంట్ పెంచడానికి తీసుకోవలసిన ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

చేప: స్పెర్మ్ కౌంట్ పెరుగుల, నాణ్యత చేపల వినియోగంతో పెరుగుతుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చేపలలో పుష్కలంగా కనిపిస్తాయి.. ఇది పురుషుల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. చేపలు తినడం వల్ల మగ సంతానోత్పత్తి మెరుగుపడుతుంది.

పండ్లు - కూరగాయలు: భారతదేశంలో నూనె, ఫ్రై ఆహారాన్ని తినే ధోరణి చాలా ఎక్కువగా ఉంది.. ఇది మొత్తం ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పురుషులు తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఇది స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది.. ఇంకా సంతానోత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది.

వాల్నట్: వాల్‌నట్ ఒక అద్భుతమైన డ్రై ఫ్రూట్‌గా పరిగణిస్తారు. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, స్థూలకాయాన్ని తగ్గించడానికి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తింటారు. అయితే వాల్‌నట్ సహాయంతో స్పెర్మ్ శక్తిని పెంచవచ్చని చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి పురుషులు తమ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకుంటే.. సంతానలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు..




