- Telugu News Photo Gallery How much weight can be kept under control if you play skipping daily, check here is details
Skipping: వారంలో బరువు తగ్గిపోవాలా.. అయితే స్పిప్పింగ్ ఇలా ఆడండి..
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. అధిక బరువు కారణంగా అనేక ఇతర సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి వ్యాధులు ఎటాక్ చేస్తాయి. కాబట్టి ఎప్పుడూ బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు తగ్గాలంటే కేవలం డైట్ మెయిన్‌టైన్ చేస్తే సరిపోదు. వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి. బరువును త్వరిత గతిన తగ్గించే వ్యాయామంలో స్కిప్పింగ్ కూడా ఒకటి. తరచూ స్కిప్పింగ్ చేయడం వల్ల..
Updated on: Sep 01, 2024 | 1:04 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. అధిక బరువు కారణంగా అనేక ఇతర సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి వ్యాధులు ఎటాక్ చేస్తాయి. కాబట్టి ఎప్పుడూ బరువును అదుపులో ఉంచుకోవాలి.

బరువు తగ్గాలంటే కేవలం డైట్ మెయిన్‌టైన్ చేస్తే సరిపోదు. వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి. బరువును త్వరిత గతిన తగ్గించే వ్యాయామంలో స్కిప్పింగ్ కూడా ఒకటి. తరచూ స్కిప్పింగ్ చేయడం వల్ల ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. మీరు సరైన డైట్ మెయిన్ టైన్ చేస్తూ.. స్పిప్పింగ్ ఆడుతూ ఉంటే వారం రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది.

ప్రతి రోజూ కేవలం పావు గంట సేపు సమయం కేటాయించండి. ఆ తర్వాత జరిగే అద్భుతం మీరే చూడండి. కేవలం అధిక బరువు మాత్రమరే కాకుండా ఊబకాయం నుంచి కూడా రిలీఫ్ అవుతారు.

స్కిప్పింగ్ ఆడుతూ ఉండటం వల్ల బాడీ చాలా ఫిట్‌గా ఉంటుంది. శరీరం అంతా కదులుతుంది. రక్తంలో పేరుకు పోయిన చెడు కొవ్వు మొత్తం కరుగుతుంది. శరీరం అంతా రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల ఎముకలు, కండరాలు కూడా బలంగా దృఢంగా ఉంటాయి. అయితే స్కిప్పింగ్ ఆడేటప్పుడు కాళ్లకు షూస్ ధరించడం వల్ల పాదాలపై ఒత్తిడి పడదు. మొదటి సారి స్కిప్పింగ్ ఆడేవారు తక్కువ సమయం నుంచి మొదలు పెట్టండి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




