- Telugu News Photo Gallery Home Tips To Check Stomach Problems Specially For You, check here is details in Telugu
Home Remedies: పొట్ట సమస్యలకు చెక్ పెట్టే ఇంటి చిట్కాలు.. స్పెషల్‌గా మీకోసం!
వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు.. అనేక అనారోగ్య సమ్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. దీంతో వీరిని ఎక్కువగా ఎటాక్ చేస్తాయి. చిన్న పిల్లలకే కాదు ఈ సమయంలో పెద్ద వారికి కూడా మల బద్ధకం, కడుపులో నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, గ్యాస్, నీరసంగా ఉండటం వంటి సమస్యలు తలెత్తుతాయి. తరుచుగా మీరు కూడా ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటుంటే.. ఈ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు. పొట్ట పట్టేసినట్లుగా ఉబ్బరంగా అనిపిస్తే.. రిలీఫ్ నెస్ పొందడానికి ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీళ్లలో ఒక స్పూన్ ఉసిరి పొడిని..
Updated on: Jan 24, 2024 | 2:55 PM

వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు.. అనేక అనారోగ్య సమ్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. దీంతో వీరిని ఎక్కువగా ఎటాక్ చేస్తాయి. చిన్న పిల్లలకే కాదు ఈ సమయంలో పెద్ద వారికి కూడా మల బద్ధకం, కడుపులో నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, గ్యాస్, నీరసంగా ఉండటం వంటి సమస్యలు తలెత్తుతాయి. తరుచుగా మీరు కూడా ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటుంటే.. ఈ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు.

పొట్ట పట్టేసినట్లుగా ఉబ్బరంగా అనిపిస్తే.. రిలీఫ్ నెస్ పొందడానికి ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీళ్లలో ఒక స్పూన్ ఉసిరి పొడిని కలుపుకుని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కడుపులో నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం.. మీరు తినే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినాలి. దీని వల్ల సులభంగా మల బద్ధకం సమస్య నుంచి రిలీఫ్ నెస్ పొందొచ్చు. అంతే కాకుండా ఫైబర్ కారణంగా శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది.

గ్యాస్, అజీర్తి వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు సోంపు తినడం లేదా సోంపు నీరు తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో ఒక స్పూన్ సోంపు గింజలు కలుపుకుని తాగితే ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు.

అదే విధంగా దాల్చిన చెక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి దాల్చిన చెక్క నీటిని తాగితే అనేక రకాల పొట్ట సమస్యల నుంచి బయట పడొచ్చు. అప్పుడప్పుడు దాల్చిన చెక్క వేసి మరగ బెట్టిన నీటిని తాగితే.. చాలా మంచిది.




