AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ అందాన్ని రెట్టింపు చేసే వంటింటి బ్యూటీ టిప్స్ ఇవే!

అందంగా కనిపించాలని ఎవరు అనుకోరు చెప్పండి, ప్రతి ఒక్కరూ చూడటానికి చాలా బ్యూటిఫుల్‌గా కనిపించాలని అనుకుంటారు. దీని కోసం మార్కెట్‌లో ఏవో ఏవో క్రీమ్స్ కొనుగోలు చేసి వాడుతుంటారు, కానీ క్రీమ్స్ కాకుండా, ఇంటిలోనే సులభంగా దొరికే వాటితో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చునంట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 01, 2025 | 5:53 PM

Share
ఇప్పుడు బ్యూటీ పార్లర్స్ వచ్చాయి. కానీ గతంలో మన పెద్ద వారు మాత్రం ఎలాంటి బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లకుండా, క్రీమ్స్ వాడకుండా , కేవలం ఇంటిలో దొరికే వాటితోనే తమ అందాన్ని పెంచుకునేవారు. అయితే వారు ఏ పదార్థాలను ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని పెంచుకునే వారో ఇప్పుడు చూద్దాం

1 / 5
మొటిమలు లేదా మచ్చలు, పిగ్మెంటేషన్‌తో బాధపడే వారు పసుపుతో వాటికి చెక్ పెట్టవచ్చు. అంతే కాకుండా తమ చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. అది ఎలా అంటే? చిటికెడు పసుపు, పెరుగు, శనగపిండి, టమాటో రసం కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ వారానికి రెండు సార్లు ముఖానికి అప్లై చేసుకోవడం వలన చర్మం, ముఖం నిగారింపుగా తయారు అవుతుంది.

2 / 5
తేనే అందాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ముఖాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేస్తుంది. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అందువలన  స్పూన్ బియ్యం పిండిలో స్పూన్ తేనే వేసి దీనిని వారంలో మూడు సార్లు ముఖానికి అప్లై చేసుకోవడం వలన ట్యాన్ రిమూవ్ అవుతుంది. ముఖం అందంగా తయారు అవుతుంది.

3 / 5
పచ్చిపాలు  అందాన్ని రెట్టింపు చేస్తాయి. పచ్చి పాలను ముఖానికి అప్లై చేయడం వలన టానింగ్ తగ్గుతుంది. ఇది ఓ ఫేస్ వాష్ లా పని చేస్తుంది. అందువలన ముఖానికి పచ్చి పాలను అప్లై చేయడం చాలా మంచిది.

4 / 5
ముల్తానీ మట్టిని చాలా మంది ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని వారానికి కనీసం మూడు సార్లు రోజ్ వాటర్‌లో కలిపి పెట్టుకోవడం వలన ఇది చర్మానికి సహజ మెరుపును ఇవ్వడమే కాకుండా మొటిమలను తొలిగిస్తుంది. టాన్ తగ్గించి, చర్మాన్ని కాపాడుతుంది.

5 / 5