AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hing For Bloating: గ్యాస్‌ సమస్యను చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా.. గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఇంగువ కలిపి..

వంటల్లో అన్నీ వేసినా రాని రుచి ఒక్క ఇంగువ (ఆసఫోటిడా)తో రెట్టింపవుతుంది. సాధారణంగా అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు ఆహారాల్లో వినియోగిస్తారు. రోజువారీ వంటలలో ఉపయోగించే అన్ని మసాలాలు ఆహారం రుచిని పెంచుతాయి. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే ఇంగువకు మాత్రం వంటల్లో ప్రత్యేక స్థానం ఉంది. చెట్టు వేర్ల నుంచి లభించే ఇంగువ జీర్ణ రసాలు ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతుంది. మసాలా దినుసుగా ఇంగువ (ఆసఫోటిడా) వంటల రుచిని పెంచడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా..

Srilakshmi C
|

Updated on: Jan 10, 2024 | 8:31 PM

Share
వంటల్లో అన్నీ వేసినా రాని రుచి ఒక్క ఇంగువ (ఆసఫోటిడా)తో రెట్టింపవుతుంది. సాధారణంగా అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు ఆహారాల్లో వినియోగిస్తారు. రోజువారీ వంటలలో ఉపయోగించే అన్ని మసాలాలు ఆహారం రుచిని పెంచుతాయి. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే ఇంగువకు మాత్రం వంటల్లో ప్రత్యేక స్థానం ఉంది. చెట్టు వేర్ల నుంచి లభించే ఇంగువ జీర్ణ రసాలు ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతుంది.

1 / 5
మసాలా దినుసుగా ఇంగువ (ఆసఫోటిడా) వంటల రుచిని పెంచడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇంగువలో పీచు, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు వివిధ సమస్యలతో పోరాడుతుంది. ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ వైశాలి శుక్లా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ అంశంపై ఒక పోస్ట్‌ను పంచుకున్నారు.

2 / 5
తరచుగా గ్యాస్ సమస్యలతో బాధపడే వారు ఆహారంలో ఇంగువను ఉపయోగించాలని ఆమె సలహా ఇస్తున్నారు. ఇంగువ సహజమైన కార్మినేటివ్‌గా పనిచేస్తుంది. కాబట్టి కడుపు ఉబ్బరం లేదా జీర్ణ సమస్యలను ఎదుర్కోవడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

3 / 5
వాతావరణ మార్పుల వల్ల పొడి దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. ఇంగువ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది. ఇంగువ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తక్కువ.

4 / 5
ఋతుస్రావం సమయంలో చాలా మంది మహిళలు పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో బాధపడుతుంటారు. ఈ సమయంలో ఇంగువ నీటిని తాగడం ద్వారా త్వరగా ఉపశమనం పొందుతారు. అలాగే తలనొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అందుకే ఎల్లప్పుడూ ఇంట్లో కొద్దిగా ఇంగువ ఉంచుకోవడం మర్చిపోకూడదు. గోరువెచ్చని నీటిలో అర చెంచా ఇంగువ కలుపుకుని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే జీర్ణసమస్యలు దరి చేరవు..

5 / 5