- Telugu News Photo Gallery Health Care Tips Drinking Drumstick leaves juice can give your relief from these health issues Know the Details
Health Care: మునగ ఆకుల రసాన్ని తాగండి.. శరీరంలోని ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టండి..!
ఆరోగ్య పరిరక్షణలో మునగ అద్భుతమై ఔషధంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కూడా మునగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
Updated on: May 09, 2022 | 6:00 AM

ఆరోగ్య పరిరక్షణలో మునగ అద్భుతమై ఔషధంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కూడా మునగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా దీని రసం.. శరీరానికి ప్రయోజనకంరగా పరిగణించబడుతుంది. దీని రసాన్ని తాగడం వల్ల అనేక రకాల రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చునని చెప్పారు.

రక్తహీనత: మీరు రక్త హీనత సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే మునగ ఆకుల రసాన్ని ట్రై చేయొచ్చు. మునగ ఆకుల రసాన్ని తాగడం వలన శరరీంలో రక్తకణాలు పెరుగుతాయి. రక్తం స్థాయి కూడా పెరుగుతుంది.

బలహీనమైన ఎముకలు: ఎముకలు బలహీనపడటానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో ఒకటి బరువు పెరగడం. మీ ఎముకలు బలహీనంగా ఉంటే.. వాటికి మంచి పోషకాహారం, విటమిన్లు అవసరం. మునగ ఆకులతో ఈ లోపాన్ని సరిచేయొచ్చు.

ఊబకాయం: ప్రస్తుత కాలంలో ఇది ఒక సాధారణ సమస్యగా మారింది. అయితే, దానికి కారణాలు చాలానే ఉండవచ్చు. ప్రధాన కారణం మాత్రం సరికాని జీవన శైలి, సమయపాలన లేని తిండి. అయితే, మునగ ఆకుల ద్వారా ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చు. ఈ రసాన్ని ఉదయాన్నే తాగితే మంచి జరుగుతుంది.

మధుమేహం నియంత్రణ: మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తి జీవితంలో ఎక్కువ భాగం మందుల వాడకంలోనే గడిచిపోతుంది. అయితే, రక్తంలో చక్కెర స్థాయిని స్వదేశీ పద్ధతుల ద్వారా కూడా నియంత్రించవచ్చు. అందులో మునగ ఆకుల రసానిది ప్రత్యేక స్తానం. ఈ ఆకుల రసాన్ని రోజూ తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.




