కొబ్బరి పాలలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. మీ జుట్టును స్ట్రెయిట్ చేయడానికి కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో కొబ్బరి పాలను తీసుకుని దానికి 4-6 చెంచాల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సుమారు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంట పాటు వదిలివేయాలి. అనంతరం షాంపూతో తల చేసుకోవాలి. తడి జుట్టును దువ్వి అలా వదిలేయండి. అంతే జుట్టు పొడవుగా స్ట్రైట్‌గా మారుతుంది.