అమ్మాయిలు.. ఈ ఐదు ప్యాక్స్ చాలు.. మెరిసే అందం మీ సొంతం..
అమ్మాయిలు అందరు అందంగా, ఆకర్షణీయంగా కనబడాలనుకుంటారు. అయితే కొంతమంది ఎంత ప్రయత్నం చేసిన సాధ్యం కాదు. అలంటివారు అందమైన, మెరిసే చర్మం కోసం కొన్ని ప్రత్యేకమైన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో తయారుచేసిన ఈ ఐదు ఫేస్ ప్యాక్‌లు మీ చర్మాన్ని మరింత అందంగా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. ఆ ప్యాక్‌లు ఏంటి.? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి.
Updated on: Jul 26, 2025 | 11:24 AM

ఓట్ మీల్, మిల్క్ ఫేస్ ప్యాక్: ఓట్ మీల్‌ను పౌడర్ గా రుబ్బి, పాలతో కలిపి పేస్ట్‌లా చేసి, ముఖం, మెడపై సున్నితంగా మసాజ్ చేయండి. కడిగే ముందు 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ మిశ్రమం చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. పోషణను అందిస్తుంది. దీంతో చర్మం అందంగా, కాంతివంతంగా మారుతుంది.

బొప్పాయి, తేనె ఫేస్ ప్యాక్: పండిన బొప్పాయిని గుజ్జులా చేసి, తేనెతో కలిపి, ముఖానికి 15-20 నిమిషాలు అప్లై చేయండి. ఈ ప్యాక్ బొప్పాయి ఎంజైమ్‌లను ఉపయోగించి కణాల పెరుగుదలను, తేనె తేమ లక్షణాలను పెంచుతుంది. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.

కలబంద, దోసకాయ ఫేస్ ప్యాక్: కలబంద జెల్, దోసకాయను కలిపి ముఖానికి 20-30 నిమిషాలు అప్లై చేయండి. ఈ ప్యాక్ ఉపశమనం కలిగించే, హైడ్రేటింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. దీనివల్ల జిడ్డు చర్మం దూరం అవుతుంది. మీ చర్మం కోమలంగా చూడగానే ఆకట్టుకొనేలా మారుతుంది.

శనగపిండి, పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్: శనగపిండి, పసుపు పొడి, పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయండి. ఈ ప్యాక్ టాన్ తొలగించడానికి, ముడతలను నియంత్రించడానికి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి సహాయపడుతుంది. దీంతో యవ్వనంగా కనిపిస్తారు.

పెరుగు, అరటిపండు ఫేస్ ప్యాక్: అరటిపండును మెత్తగా చేసి, పెరుగుతో కలిపి, ముఖానికి అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ తేమ, ఎక్స్‌ఫోలియేషన్‌ను అందిస్తుంది. ఇలా చేస్తే చర్మం ఆకర్షణీయంగా మారుతుంది.




