- Telugu News Photo Gallery From Infosys to TCS, know the whopping salaries of CEOs of top Indian IT firms Telugu News
దేశంలోనే అత్యధిక జీతాలు అందుకుంటున్న ఐదుగురు ఐటీ సీఈవోలు ఎవరో తెలుసా..? కోట్లల్లో శాలరీ
దేశంలో ఇన్ఫోసిస్ నుండి టిసిఎస్, విప్రో, హెచ్‌సిఎల్ వరకు అనేక ఐటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. ఆయా కంపెనీల వ్యాపారం దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ విస్తరించి ఉంది. ఈ కంపెనీలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే ఈ కంపెనీల సీఈవోలు ఎవరో తెలుసా..? వారి జీతం ఎంత ఉంటుందో తెలుసా..?
Updated on: Mar 18, 2023 | 8:26 PM

Hcl Tech Ceo C Vijayakumar- 2022లో అత్యధిక జీతం పొందిన హెచ్‌సిఎల్ కంపెనీకి చెందిన CEO సి. విజయకుమార్. 2021లో అతని జీతం రూ. 123.13 కోట్లు. ఒక నివేదిక ప్రకారం వారు వార్షిక జీతం అందుకుంటున్నారు.

Wipro Ceo Thierry Delaporte-ఈ జాబితాలో విప్రో సీఈవో రెండో స్థానంలో నిలిచారు. థియరీ డెలాపోర్టే వార్షిక ప్యాకేజీ FY2022లో రూ. 79.8 కోట్లు.

Infosys Ceo Salil Parekh-ఇన్ఫోసిస్ కంపెనీ సీఈఓ సలీల్ పారిఖ్ 2022లో రూ. 71.02 కోట్లు అందుకున్నారు. అత్యధికం వేతనం తీసుకున్న సీఈవోల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు.

Tech Mahindra Ceo Cp Gurnan- టెక్ మహీంద్రా CEO, MD CP గుర్నానీ నాల్గవ స్థానంలో ఉన్నారు. అతని జీతం గత సంవత్సరం 189 శాతం పెరిగింది. రూ. 63.4 కోట్లు తీసుకున్నారు.

Tcs Ceo Rajesh Gopinathan- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ CEO, MD రాజేష్ గోపీనాథన్ చివరిగా అంటే 5వ స్థానంలో ఉన్నారు. ఆయన సెప్టెంబర్ 15, 2023 వరకు మాత్రమే సంస్థతో కలిసి పని చేస్తారు. 2021-22 ఆర్థిక ఏడాదిలో ఆయన పరిహారం 26.6 శాతం పెరిగి రూ.25.75 కోట్లకు చేరింది.





























