Liver Health: ఈ ఆహారాలతో మీ కాలేయ ఆరోగ్యం పదిలం.. వెంటనే మీ డైట్ లో చేర్చుకోండి..
మానవ శరీరంలో కీలమైన అవయవాల్లో కాలేయం ఒకటి. మనం తినే ఆహారం అంత కాలేయం ద్వారా నిర్వహించబడుతుంది. శరీర ప్రక్రియలకు అవసరమైన అదనపు కొవ్వులు, ప్రోటీన్లు వంటివి లివర్ నియంత్రణలో ఉంటాయి. కాలేయం అనారోగ్యం బారిన పాడడం వల్ల జీవక్రియ సమస్యలు, కాలేయ వ్యాధి లాంటివి సంభవించవచ్చు. కొన్ని ఆహారాలు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో తోడ్పడతాయి. లివర్ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jul 10, 2023 | 3:29 PM

ద్రాక్ష: ద్రాక్షలో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయ్. ఇవి మంటను తగ్గించడంతోపాటు.. లివర్‌ను ఆరోగ్యంగా కాపాడడంలో సహాయపడతాయి. ద్రాక్ష పండ్లు శరీరంలోని యాంటీఆక్సిడెంట్స్ మెరుగుపరుస్తాయి.

ఆకుకూరలు: లైవ్ హెల్త్ మెరుగుపరచడంలో ఆకు కూరలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆకు కూరలలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ ను మెరుగుపరచి కాలేయ పనితీరుకు తోడ్పడతాయి. మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఆకు కూరలు, బ్రోకలీ లాంటి వాటిని తినాలి. వీటి కారణంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నుంచి రక్షణ పొందవచ్చు.

వోట్మీల్: వోట్మీల్ మీ ఆహారంలో ఫైబర్ పెంచడంలో సహాయపడుతుంది. ఓట్స్‌లో ఉండే ప్రత్యేక ఫైబర్‌లు కాలేయా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. వోట్స్ రోగనిరోధక వ్యవస్థ మాడ్యులేషన్‌లో కోసం సహాయపడతాయి. మధుమేహం, ఊబకాయంతో పోరాడడంలో ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటాయి.

బెర్రీలు: బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉన్న కారణంగా వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి కాలేయం దెబ్బతినకుండా కాపాడుతాయి. బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్‌ల కార్యకలాపాలను, రోగనిరోధక కణాల ప్రతిస్పందనను కూడా మెరుగుపరుస్తాయి.

కాఫీ: కాలేయ పనితీరును మెరుగుపర్చేందుకు సహాయపడే వాటిలో ఒకటి కాఫీ. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్నవారిలో, కాఫీ తీసుకోవడం వల్ల సిర్రోసిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. కాఫీ వినియోగం కాలేయ వాపును నియంత్రించి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాలేయ క్యాన్సర్, దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్న వ్యక్తులు రోజూ మూడు కప్పుల కాఫీ తాగడం మంచింది.